క్రీడాభూమి

తొలి రౌండ్‌లో గెలిచిన సెరెనా, కరోలిన్ జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, జనవరి 6: వారిద్దరూ సేహితురాళ్లు, సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌లు.. ఐతే సోమవారం డబుల్స్ పార్టనర్స్‌గా రంగంలోకి దిగి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. సెరీనా విలియమ్స్, కరోలిన్ వోజ్నియాక్కిలు ఓ జుట్టుగా అక్‌ల్యాండ్‌లోని ఏఎస్‌బీ క్లాసిక్ తొలిరౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగి విజయాన్ని అందుకున్నారు. జపాన్‌కు చెందిన నావో హిబినో, మికోటో నినోమియాలతో తలపడి 6-2, 6-4 స్కోరుతో గెలుపొందారు. కేవలం 70 నిమిషాల్లోనే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. కాగా సెరీనా విలియమ్స్, కరోలిన్ వోజ్నియాక్కి జంట ఇప్పటి వరకు 24 గ్రాండ్‌స్లాం టైటిళ్లు, 102 డబ్ల్యుటీఏ సింగిల్స్ టైటిళ్లు సొంతం చేసుకోవడం జరిగింది. సెరీనా విలియమ్స్ విడిగా మరో 23 డబుల్స్ టైటిళ్లు గెలుచుకోగా అందులో 13 గ్రాండ్‌స్లాం, మూడు ఒలంపిక్ టైటిళ్లు ఉన్నాయి. ఇందులో అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌లు విలియమ్స్ తన సోదరి వీనస్‌తోనే ఉన్నాయి. 2015 నుంచి సెరీనా ఒక్క వీనస్ విలియమ్స్ మినహా మరెవరి భాగస్వామ్యంతో డబుల్స్ బరిలోకి దిగలేదు. అలాగే వోజ్నియాక్కి గత మూడేళ్లుగా డబుల్స్ బరిలోకి దిగలేదు. ఆమె అక్‌ల్యాండ్ టోర్నీలో వరుసగా ఆరోదఫా పాల్గొంటోంది. ఈక్రమంలో ఆమె ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత కాంపిటీటివ్ టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యే అవకానుంది. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాల కలయిక ఇదే చివరి సారి. వచ్చే మేనెలలో కోప్‌హెగన్‌లో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దిగ్గజ క్రీడాకారిణులు పరస్పరం తలపడతారు. అది వోజ్నియాక్కీ వీడ్కోలు మ్యాచ్.

''చిత్రాలు.. సెరెనా, కరోలిన్