క్రీడాభూమి

భార్య, కూతురే నా బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ‘కుటుంబం కారణంగానే ఆటలో ఏకాగ్రతను, నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతున్నాన’ని భారత వైట్‌బాల్ క్రికెట్ వైస్ కెప్టెన్, మూడు ఫార్మేట్ల ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 2019లో బ్రహ్మాండమైన ప్రదర్శన ద్వారా ఓపెనర్‌గా 2,442 పరుగులు సాధించిన రోహిత్ టెస్టు ఓపెనర్‌గా అసమాన ప్రతిభను కనబరిచాడు. కాగా తన సతీమణి రేఖ, కుమార్తె సమారియాలతో ఇంట్లో గడిపే ఆనంద క్షణాలు తనకెంతో స్ఫూర్తినిస్తున్నాయని రోహిత్ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ఈ విషయంలో ఇతరుల గురించి కూడా తాను పట్టించుకోనన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 12 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న 32 ఏళ్ల రోహిత్ తాను విమర్శలను ఎంతమాత్రం పట్టించుకోనని వెల్లడించాడు. తన భార్య, కుమార్తె తనకు అపారమైన ప్రేమను పంచడం ద్వారా అనిర్వచనీయ ఆనందానుభూతిని కలిగిస్తున్నారని, ఆ పరిధిలోనే గడపాలని తానెల్లప్పుడూ కోరుకుంటానన్నాడు. ‘ఐనా పొగడ్తలకు, తెగడ్తలకు స్పందించే వయసును నేనెప్పుడో దాటిపోయాను’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. వీరేంద్ర సేవాగ్ వెళ్లిపోయిన తర్వాత సరైన ఓపెనర్ కోసం భారత్ అనే్వషిస్తున్న తరుణంలో దక్షిణాఫ్రికాతో తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన రోహిత్ ఆశాకిరణంగా మారాడు. అదే విషయాన్ని ఆయనకు గుర్తు చేయగా ‘వాస్తవానికి చాలాకాలం క్రితమే తాను టెస్టు మ్యాచ్‌ల గురించి ఆలోచించడం మానేశానన్నాడు. గతంలో టెస్టు మ్యాచ్ విజయాలపై తాను ఎక్కువగా ఆలోచించేవాడినని ‘ఆ బాల్‌ను ఆలా ఎందుకు ఆడాను?, అప్పుడలా జరగాల్సిందికాదు అనుకునే వాడిని’ మ్యాచ్ తరువాత వీడియో విశే్లషకుడి వెళ్లి కూర్చుని మరింతగా బుర్ర పాడు చేసుకునేవాడిని’ అని ఆ తర్వాత అది మంచిది కాదని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

'చిత్రం...రోహిత్ శర్మ