క్రీడాభూమి

సీనియర్లు బాగా ఆడితేనే.. టీ 20ల్లో భారత్‌ను ఓడించగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, జనవరి 6: ‘తన ప్రదర్శన స్థాయికి తగిన విధంగా లేద’ని అంగీకరించిన శ్రీలంక వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు మరింత బాధ్యతాయుతంగా ఆడితేనే టీ 20 సిరీస్‌లో భారత జట్టును ఓడించగలమని అభిప్రాయపడ్డాడు. శ్రీలంక జట్టు అయోమయ స్థితిలో ఉందని, కుమార సంగక్కర, మహేళా జయవర్దనే వంటి దిగ్గజ క్రికెటర్లకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించాడు. ‘టెస్టు క్రికెట్‌లో వైట్‌బాల్‌ను ఎదుర్కోవడంలో నేను ఇబ్బందులు పడుతున్నాను. ఇటీవల ఆస్ట్రేలియాలో కొంత మెరుగ్గా ఆడినప్పటికీ అదికూడా స్థాయికి తగ్గవిధంగా కాద’ని పెరీరా పేర్కొన్నాడు. భారత సిరీస్‌లో సమర్థవంతంగా ఆడేందుకు వంద శాతం కృషి చేస్తానన్నాడు. పెరీరాకు 18 టెస్టులు, 98 వన్‌డే మ్యాచ్‌లు, 43 టీ20 మ్యాచ్‌ల అనుభవం ఉంది. ప్రపంచ ర్యాంకుల్లో టీ 20ల్లో భారత్ ఐదవ స్థానంలో ఉంది. వన్‌డేల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక టెస్టు మ్యాచ్‌ల్లో అగ్ర స్థానంలో నిలిచింది. ఇక శ్రీలంక జట్టు టీ 20ల్లో ఏడో స్థానంలో, వన్‌డేల్లో ఎనిమిదో స్థానంలో, టెస్టు క్రికెట్‌లో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

'చిత్రం... శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా