క్రీడాభూమి

కీలకం కానున్న మహారాష్ట్ర, అస్సాం జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఈనెల 10 నుంచి 22 వరకు గౌహతిలో జరిగే ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్‌లో మహారాష్ట్ర, ఆతిధ్య అస్సాం జట్లు కీలకం కానున్నాయని క్రీడాపండితులు అంచనా వేస్తున్నారు. తమ జట్లు టోర్నీలోని అన్ని ఈవెంట్లలో పాల్గొనబోతున్నట్టు ‘డీ మిషన్ ఆఫ్ అస్సాం’ చీఫ్ నవజ్యోతి బసుమటరీ తెలిపారు. మొత్తం 656 మంది అథ్లెట్లను తమ రాష్ట్రం బరిలోకి దింపుతోందన్నారు. తమ జట్లు అన్ని ఈవెంట్లలో గణనీయంగా రాణిస్తాయని, అందుకు అత్యధికంగా హాజరయ్యే స్థానిక ప్రేక్షకుల మద్దతుకూడా లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జట్లకు మంచి తర్ఫీదును ఇస్తున్నట్టు వివరించారు. ఈ దఫా ఖచ్చితంగా టాప్ టెన్ జట్లలో ఒకటిగా తమ జట్లు ఉంటాయన్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్లతో కూడిన మహారాష్ట్ర జట్టు ఈ పోటీల్లోకి 751 మంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులను దింపుతోంది. తమ జట్లు సైతం టోర్నీలోని అన్ని ఈవెంట్లలో పాల్గొంటుందని డీమిషన్ చీఫ్ విజయ్ సంతాన్ తెలిపారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో తమ జట్టు మంచి ప్రావీణ్యంతో ఉందన్నారు. చాంపియన్‌షిప్‌లను నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.