క్రీడాభూమి

కొత్త ఏడాదిని సానుకూలంగా మలుచుకుంటుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్: కొత్త ఏడాదిని సానుకూల వైఖరితో ప్రారంభిస్తానని భారత దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ధీమాగా ఉంది. ‘మలేషియా మాస్టర్స్ సూపర్ 500’ టోర్నీలో ఆమె మంగళవారం నుంచి తలపడనుంది.ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్న సింధు గత ఏడాది స్విడ్జర్లాండ్, బాసెల్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో విజయాలతో దూసుకెళ్లింది. ఐతే తర్వాత సీజన్లలో ఆమె పేలవమైన ఆట తీరుతో అనిమానులను నిరాశపరచింది. కాగా ఒలంపిక్స్‌కు ఇంకా ఏడు నెలలకంటే తక్కుల కాల వ్యవధే ఉన్న తరుణంలో మళ్లీ రాటుదేలాలన్న కృతనిశ్చయంతో సింధు విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ 40 లక్షల డాలర్ల మహిళల సింగల్స్ పోటీల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి రౌండ్‌లో ఆమె సులభతర పోటీనే ఎదుర్కోనుంది. రష్యాకు చెందిన ఎవెగెనియా కోసెట్స్‌కాయాతో సింధు తలపడనుంది. కార్వర్ట ఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ తాయ్ త్సు యంగ్‌ను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అలాగే భారత్‌కు చెందిన మరో ప్రఖ్యాత క్రీడాకారిణి సైనానెహ్వాల్ సైతం క్వాలిఫైయర్ మ్యాచ్‌లో అగ్జియాటా అరేనాతో తలపడనుంది. గత ఏడాది సైనా ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సైనా తర్వాత పాల్గొన్న అన్ని టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగి నిరాశపరచింది. కాగా ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ టైటిల్ విజేత కిదాంబి శ్రీకాంత్ ఆరంభ మ్యాచ్‌లో చైనాకు చెందిన చౌటీన్ చెన్‌తో తలపడతాడు. బీడబ్ల్యు ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న సాయి ప్రణీత్ సైతం డెన్మార్క్‌కు చెందిన రస్మస్ జెమ్కేతో తలపడతాడు.
'చిత్రం...భారత దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు