క్రీడాభూమి

ఒమన్‌పై నమీబియా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒమన్, జనవరి 8: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ రెండో వనే్డ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఒమన్ జట్టుపై నమీబియా 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 324 పరుగులు చేసింది. ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ (0) డకౌటైనా మరో ఓపెనర్, వికెట్ కీపర్ జెన్ గ్రీన్ (62) అర్ధ సెంచరీకి తోడు క్రెయగ్ విలియ మ్స్ (129, నాటౌట్) సెంచరీ చేయడంతో నమీబియా భారీ స్కోరు చేసింది. బిలాల్ ఖాన్ 4 వికెట్లు తీయగా, కెప్టెన్ జీషన్ మాసూద్ 2, మహ్మద్ నదీం 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఒమన్ జట్టు 45 ఓవర్లలోనే 272 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ సూరజ్ కుమార్ (58), మహ్మద్ నదీం (41), మహ్మద్ సనూత్ (40), సందీప్ గౌండ్ మాత్రమే ఫర్వాలేదనిపించారు. నమిబీయా బౌలర్లలో జేజే స్మిత్ 5 వికెట్లు పడగొట్టగా, జాన్ డీ విలియర్స్ 2, జాన్ ఫ్రైలింక్, క్రెయగ్ విలియ మ్స్ ఒక్కో వికెట్ తీశారు.