క్రీడాభూమి

బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జనవరి 8: తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ ప్యాట్ కమిన్స్ 904 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలవగా, న్యూజిలాండ్ బౌలర్ నెల్ వాగ్నార్ 852 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ ఒక స్థానం మెరుగు పరుచుకొని 830 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఫర్వాలేదనిపిం చిన కగిసో రబద ఒక స్థానం దిగజారి 821 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 796 రేటింగ్ పాయింట్లతో టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (794), దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన జేమ్స్ అండర్సన్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 791 రేటింగ్ పాయింట్లతో 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నర్ ఫిలాండర్ 786 రేటింగ్ పాయింట్లు సాధించి 8 స్థానంతో సరిపెట్టుకోగా, టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (772), మహ్మద్ షమీ (771) రేటింగ్ పాయంట్లతో టాప్-10లో నిలిచారు.

'చిత్రం...ప్యాట్ కమిన్స్