క్రీడాభూమి

యువ భారత్‌దే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్బన్, జనవరి 9: దక్షిణాఫ్రికా వేదికగా ఆతిథ్య జట్టుతో గురువారం జరిగిన అండర్ -19 క్వాడ్రంగ్యులర్ సిరీస్ ఫైనల్‌లో యువ భారత జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 259 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (101) సెంచరీకి తోడు తిలక్ వర్మ (70), సిద్దేష్ వీర్ (48, నాటౌట్) రాణించారు. జెరాల్డ్ కోటేజ్ 3 వికెట్లు తీయగా, మోండ్లీ ఖుమ్లో, బ్రైస్ పర్స న్స్, టియాన్ వన్ వూరెన్, మోదిమో కానే ఒక్కో వికెట్ తీశారు. ఈ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు 20 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలోనే ఇవ్వడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు 43.1 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూ లింది. జాక్ లీస్ (52), జొనాథన్ బర్డ్ (39) మాత్రమే రాణించారు. అథార్వ అంకోల్కేర్ 4 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ 2, ఆ కాశ్ సింగ్, తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, సిద్దేష్ వీర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
''చిత్రాలు.. .. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ధ్రువ్ జురెల్
*ట్రోఫీతో భారత జట్టు