క్రీడాభూమి

ప్రశాంత్ కుమార్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 12: రంజీట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఆర్ జ్ఞానేశ్వర్ అర్ధ సెంచరీ, ప్రశాంత్ కుమార్ సెంచరీ సాధించడంతో ఆంధ్రా జట్టుకు 12 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 13 పరుగులతో రెండో రోజు ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా ఓపెనర్లు చూడచక్కని షాట్లతో రాణించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఈ క్రమంలో సీఆర్ జ్ఞానేశ్వ ర్ (73) మెహిడి హసన్ బౌలింగ్‌లో తన్మయ్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హనుమ విహారి (41, బ్యాటింగ్) సహకరంతో ప్రశాంత్ కుమార్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా 78 పరుగుల ను జోడించారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్రా జట్టు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయ 237 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలరల్లో మెహిడి హసన్‌కు 1 వికెట్ దక్కింది.
స్కోర్ బోర్డు..
హైదరాబాద్ మొదటి ఇన్నింగ్స్: 225 (77.5 ఓవర్లలో ఆలౌట్)
ఆంధ్రా మొదటి ఇన్నింగ్స్: సీఆర్ జ్ఞానేశ్వర్ (సీ) తన్మయ్ అగర్వాల్ (బీ) మెహిడి హసన్ 73, ప్రశాంత్ కుమార్ (బ్యాటింగ్) 117, హనుమ విహారి (బ్యాటింగ్) 41.
ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 237 (94 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి)
వికెట్ల పతనం: 1- 159
బౌలింగ్: రవికిరణ్ 21-4-54-0, చామ మిలింద్ 17-3-34-0, యుద్విర్ సింగ్ 14-5-30-0, తెలుకుపల్లి రవితేజ 11-2-42-0, మెహిడి హసన్ 31-7-71-1.
బెంగాల్‌పై విదర్భ విజయం..
నాగ్‌పూర్: బెంగాల్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో విదర్భ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో రోజు ఆదివారం నాటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విదర్భ 212 పరగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. బెంగాల్ బౌలర్లలో ఆర్నాబ్ నంది, షెహబాజ్ అహ్మద్, శ్రేయాన్ చక్రబొర్తి తలా మూడేసి వికెట్ల తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు బెంగాల్ జట్టు ఆదిత్య సర్వతే బౌలింగ్ దెబ్బకు 99 పరుగు లకే కుప్పకూలింది. ఆదిత్య సర్వతేతో పాటు అక్షయ్ వాఖరే, అక్షయ్ కర్నేవార్‌ల కు చెరో 2 వికెట్లు దక్కాయ. దీంతో 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 1 వికెట్ నష్టపోయ 13.5 ఓవర్లలోనే విజయం సాధించింది.
ముంబయ భారీ స్కోరు..
చెన్నై: రంజీట్రోఫీలో భాగంగా తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్ ముంబయ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్, వికెట్ కీపర్ ఆదిత్య థారే (154) భారీ సెంచరీకి తోడు, శామ్స్ ములానీ (87), శశాంక్ అట్టఠ్దే (58) అర్ధ సెంచరీల తో రాణించడంతో రెండో రోజు ఆదివారం 488 పరుగుల వద్ద ముంబయ ఆలౌటైంది. రవి శ్రీనివాసన్ సాయ కిషోర్‌కి 4 వికెట్లు దక్కగా, రవిచంద్రన్ అశ్వి న్ 3, బాబా అపరంజిత్, నటరాజన్, క్రిష్ణమూర్తి విఘ్నేష్ చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన తమిళనాడు జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఓపెనర్లు అభినవ్ ముకుంద్ (52), సూర్యప్రకాశ్ (11) క్రీజులో ఉన్నారు.
''చిత్రాలు.. శశాంక్ అట్టఠ్దే (58)
*బెంగాల్ బౌలర్ షెహబాజ్ అహ్మద్