క్రీడాభూమి

టీ-20 వరల్డ్ కప్‌లో 20 జట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 13: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ-20 ప్రపంచ కప్‌లో ఆడే జట్లను 16 నుంచి 20 వరకు పెంచేందుకు యోచిస్తోంది. అయితే, ఈ ఆలోచనను ఇప్పటికిప్పుడే అమల్లోకి తీసుకురాకున్నా 2023-31 మధ్యకాలంలో అమలు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడా పోటీలతోపాటు క్రికెట్ పట్ల కూడా విశ్వవ్యాప్తంగా అభిమానులతోపాటు ప్రజాదరణ పెరుగుతుండడంతో దీనికి మరింత బలం చేకూర్చేందుకు వీలుగా టీ-20 వరల్డ్ కప్ నుంచి ఇప్పుడున్న 16 టీమ్‌లను 20 టీమ్‌లుగా పెంచేందుకు ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు భోగట్టా. ఇందులో భాగంగా తొలి టీ-20 వరల్డ్ కప్ 2024న జరుగనుంది. అప్పటి నుంచే 20 జట్లతో పోటీలను నిర్వహించడం ద్వారా క్రికెట్‌కు మరింత జనాదరణ పొందడంతోపాటు రెవెన్యూపరంగా ఐసీసీకి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీ-20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పుడున్న జట్టను 16 నుంచి 20కి పెంచాలన్న యోచనను ఐసీసీ చాలాకాలం కిందటే ప్రతిపాదించింది. అయితే, అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఐసీసీ ఆలోచన కార్యరూపం దాల్చితే వచ్చే టీ-20 వరల్డ్ కప్ నుంచి ఇపుడున్న దేశాల జట్లకు తోడు కెనడా, జర్మనీ, నేపాల్, నైజీరియాకు చెందిన టీమ్‌లు కూడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే, జట్ల సంఖ్య ఖరారైన తర్వాత పోటీలను ఏవిధంగా నిర్వహించాలో అన్న విషయంలో ఐసీసీ కూలంకషంగా చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.