క్రీడాభూమి

భళా.. ఆస్ట్రేలియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అద్భుత బౌలింగ్.. అంతే అద్భుతమైన బ్యాటింగ్‌తో కంగారూలు భారత్‌పై పైచేయ సా ధించారు. ముంబయి వేదికగా జరిగిన మొదటి వనే్డలో ఆస్ట్రేలి యా జట్టు ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 255 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలో నే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (10) స్టార్క్ బౌలింగ్‌లో వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి ధావన్ నెమ్మదిగా జట్టును ముందుకు నడిపించాడు. క్రీజులో కుదురుకు న్నాక వరుస బౌండరీలతో తనెంత ప్రమాదకర బ్యాట్స్‌మెనో ఆసిస్ బౌలర్లకు చూపించాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సైతం అంది వచ్చిన బంతుల్ని బౌండరీలకు పంపుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అర్ధ సెంచరీకి దగ్గరగా వచ్చిన రాహుల్ (47) ఆస్టన్ అగర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ ధావన్‌తో జతకట్టాడు. అయితే కొద్దిసేపటికే మంచి జోష్‌లో కనిపించిన ధావన్ (74) ప్యాట్ కమిన్స్‌కు చిక్కాడు. ఈ దశలో యువ ఆట గాడు శ్రేయాస్ అయ్యర్‌తో జట్టును ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్న కోహ్లీ (16), సిక్సర్ కొట్టిన కొద్దిసేపటికే జంపా బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (4) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. అప్పటికీ భారత్ 32.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
ఆదుకున్న రిషభ్, జడేజా..
164 పరుగులకే టాప్ ఆర్డర్ అంతా పెవిలియన్‌కు చేరడం తో వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి నెమ్మది గా జట్టు స్కోరును 200 దాటించారు. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో రవీంద్ర జడేజా (25) కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్ లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే రిషభ్ పంత్ (28) కూడా క్రీజు వ దలగా, శార్దుల్ ఠాకూర్ (13), కుల్దీప్ యాదవ్ (17), మహ్మద్ షమీ (10) తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా, ప్యాట్ కమిన్స్, కేన్ రిచర్డ్‌సన్‌లకు రెండేసి వికెట్లు, ఆడమ్ జంపా, ఆస్టన్ అగార్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆడుతూ పాడుతూ..
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 37.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ (128), ఆరోన్ ఫించ్ (110) సెంచరీలు చేసి జట్టును గెలిపించారు. వీరిద్దరూ కలిసి 284 విలువైన భాగస్వా మ్యాన్ని నమోదు చేశారు. దీంతో మూడు వనే్డల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
మార్క్‌వాతో సంయుక్తంగా..
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా మార్క్‌వాతో సంయుక్తంగా నిలిచాడు. వార్నర్‌కి ఇది 18వ సెంచరీ. వీరిద్దరి కంటే ముందు రికీ పాంటింగ్ (29) ఉన్నాడు.
వాంఖడేలో అత్యధిక భాగస్వామ్యం..
వాంఖడే స్టేడియంలో ఏ వికెట్‌కు అయినా అత్యధిక భాగస్వామ్యం సాధించిన బ్యాట్స్‌మెన్లుగా ఆరోన్ ఫించ్, డేవి డ్ వార్నర్ నిలిచారు. వీరిద్దరూ కలిసి (258) పరుగులు సాధిం చారు. అంతకుముందు ఈ ఘనత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు రాస్ టేలర్, టామ్ లాథమ్ పేరిట ఉంది. వీరిద్దరూ కలిసి 2017లో భారత్‌పై 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
స్కోర్ బోర్డు:
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) వార్నర్ (బీ) స్టార్క్ 10, శిఖర్ ధావన్ (సీ) అగార్ (బీ) ప్యాట్ కమిన్స్ 74, లోకేష్ రాహుల్ (సీ) స్టీవ్ స్మిత్ (బీ) అగార్ 47, విరాట్ కోహ్లీ (సీ) (బీ) జంపా 16, శ్రేయాస్ అయ్యర్ (సీ) అలెక్స్ క్యారీ (బీ) స్టార్క్ 4, రిషభ్ పంత్ (సీ) టర్నర్ (బీ) ప్యాట్ కమిన్స్ 28, రవీంద్ర జడేజా (సీ) అలెక్స్ క్యారీ (బీ) కేన్ రిచర్డ్‌సన్ 25, శార్దుల్ ఠాకూర్ (బీ) స్టార్క్ 13, మహ్మద్ షమీ (సీ) అలెక్స్ క్యారీ (బీ) కేన్ రిచర్డ్‌సన్ 10, కుల్దీప్ యాదవ్ (రనౌట్) స్టీవ్ స్మిత్ 17, జస్ప్రీత్ బుమ్రా (బ్యాటింగ్) 0.
ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 255 (49.1 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-13, 2-134, 3-140, 4-156, 5-164, 6-213, 7-217, 8-229, 9-255, 10-255.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 10-0-56-3, ప్యాట్ కమిన్స్ 10-1-44-2, కేన్ రిచర్డ్‌సన్ 9.1-0-43-2, ఆడమ్ జంపా 10-0-53-1, ఆస్టన్ అగార్ 10-1-56-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 128, ఆరోన్ ఫించ్ (నాటౌట్) 110.
ఎక్స్‌ట్రాలు: 20, మొత్తం: 258
బౌలింగ్: మహ్మద్ షమీ 7.4-0-58-0, జస్ప్రీత్ బుమ్రా 7-0-50-0, శార్దుల్ ఠాకూర్ 5-0-43-0, కుల్దీప్ యాదవ్ 10-0-55-0, రవీంద్ర జడేజా 8-0-41-0.

''చిత్రాలు.. శిఖర్ ధావన్ (74)
*ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్