క్రీడాభూమి

నువ్వా..నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఈ ఏడాది ప్రారంభమైన తొలి వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఇటు కోహ్లీ, అటు ఫించ్ సేన పోటాపోటీగా బరిలోకి దిగనుంది. మూడు వనే్డల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజ యం సాధించాయ. దీంతో ఆదివారం జరిగే నిర్ణయాత్మక చివరి వనే్డపైనే అందరి దృష్టి పడింది. రెండు ప్రధాన జట్ల మధ్య జరిగే తుది పోరుపై అభిమానులు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇది లాఉంటే గత మ్యాచ్‌లో పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొన్న ఆస్ట్రే లియా జట్టు ప్రతీకారం ఎదురు చూస్తుండగా, సొంత గడ్డపై ఎలాగైనా సిరీస్‌ను సాధించి ఈ ఏడాది ఘనమైన ఆరంభాన్ని ఇవ్వాలిని కోహ్లీసేన భావిస్తోంది.
గాయాలతో సతమతం..
కంగారూలపై సిరీస్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయ. తొలి వనే్డ తర్వాత గాయం కారణంగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆటకు దూరం కాగా, తాజాగా రెండో వనే్డలో ఓపెనర్లిద్దరూ గాయపడ డం ఆందోళన రెకేత్తిస్తోంది. రెండో వనే్డలో తృటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయన శిఖర్ ధావన్‌కు పక్కటెముకల్లో బంతి బలంగా తగలడం తో ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. అదే మ్యాచ్‌లో బంతిని బౌండరీ వద్ద ఆపే ప్రయత్నంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటు న్నారు. అయతే నేడు జరిగే మ్యాచ్‌లో వీరు ఆడతారా? లేదా? అనేది జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికీ ప్రకటించలేదు.
శ్రేయాస్, మనీష్ నిరాశ..
గత కొద్దిరోజులుగా వరుసగా అన్ని సిరీస్‌ల్లో చోటు దక్కిం చుకున్న శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమ య్యాడు. తొలి మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో బరిలోకి దిగినా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. రెండో వనే్డలో నూ అదే తరహా ఆట కనబరిచాడు. అయతే జట్టులో పోటీ అధికమవడం తో చివరి వనే్డలో శ్రేయాస్ అయ్యర్ తప్పక రాణించాల్సిన పరిస్థి తి. మరోవైపు మనీష్ పాండేకు ఈ సిరీస్‌లో రెండు మ్యాచు ల్లోనూ అవకాశం కల్పించినా సద్విని యోగించుకోలేక పోయా డు. కనీసం రెండంకెల స్కోరును దాటేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. అయతే మనీష్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.
రాహులే హీరో..
ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేసింది కేఎల్ రాహుల్ ఒక్కడే. గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించి, తను ఏ స్థానంలోనైనా ఆడగలనని నిరూ పించాడు. అంతేకాకుండా వికెట్ కీపర్‌గా ఎంతో ఒత్తిడి ఉన్నా ఏమాత్రం బయటకు కనిపించనీయలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఇటు బ్యాటింగ్, అటు వికెట్ కీపింగ్ తన సత్తా చాటాడు. అంతేకాకుండా టీమిండియా తరఫున వేగంగా 1000 పరుగు లు సాధించిన నాలుగో క్రికెటర్‌గానూ రాహుల్ గత మ్యాచ్ ద్వారా ఈ ఘనత అందుకున్నాడు.
తక్కువగా అంచనా వేయొద్దు..
మొదటి వనే్డలో వికెట్ నష్టపోకుండా మ్యాచ్‌ను గెలిపించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ గత మ్యాచ్‌లో తక్కువ స్కోర్లకే పెవిలి యన్ చేరడం భారత్‌కు కలిసొచ్చింది. అయతే నేడు జరిగే మ్యాచ్‌లో టీమిండి యా బౌలర్లు ఆసిస్‌ను తక్కువగా అంచనా వేస్తే పొరపడినట్లే. గత మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, లబుషేన్ మిడిలార్డర్‌లో అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని టీమిండియా బౌలింగ్ యంత్రాంగం ఆచితూచి బంతులు వేయాల్సి ఉంటుంది.

*టీమిండియా జట్టు
(ఫైల్)