క్రీడాభూమి

సెరెనా సునాయాస విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా 24వ గ్రాండ్‌స్లాం టైటిల్‌పై కనే్నసిన 38 ఏళ్ల దిగ్గజ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సోమవారం తొలిరౌండ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. కేవలం 19 నిమిషాల్లోనే తొలిసెట్‌లో రష్యన్ టీనేజర్ పొటపోవాను ఓడించి సత్తాచాటింది. లైలిక్ డ్రస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన సెరీనా పవర్‌ఫుల్ స్ట్రోక్స్‌తో పొటపోవాను ఇక్కట్లపాలు చేసింది. 6-0, 6-3 స్కోరుతో కేవలం 58 నిమిషాల వ్యవధిలోనే విజయాన్ని కైవసం చేసుకుంది. ఆమె తదుపరి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ స్లొవేనియాకు చెందిన తమరా జిడానె్సక్ లేదా దక్షిణ కొరియాకు చెందిన హాన్ నలాయ్‌తో తలపడే అవకాశాలున్నాయి. ఈ టోర్నీలో విజయం సాధిస్తే గ్రాండ్‌స్లాం టైటిల్స్ ఆల్‌టైం రికార్డును సెరీనా సమం చేస్తుంది. కూతురు ఒలింపియాకు జన్మనిచ్చిన తర్వాత మూడేళ్లుగా టైటిల్ దాహంతో ఉన్న సెరీనా అక్లాండ్‌లో తొలి విజయం ద్వారా దూసుకువస్తోంది. ఈ తాజా టైటిల్‌ పోరును సెరీనా కూతురు ఒలింపియా స్వయంగా వీక్షిస్తోంది.

'చిత్రం... సెరెనా విలియమ్స్