క్రీడాభూమి

కోహ్లీ నంబర్ వన్.. రోహిత్ నంబర్ టూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 20: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్‌డే బ్యాటింగ్ విభాగం ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలను నిలుపుకున్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో ఫాస్ట్‌బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ సోమవారం నాడిక్కడ విడుదలయ్యాయి. భారత్‌లో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడం ద్వారా ఈ దిగ్గజ క్రికెటర్లు తమ ఆధిపత్యాన్ని చాటిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కోహ్లి నంబర్ వన్ స్థానంలో, రోహిత్ శర్మ రెండో స్థానంలో తమ స్థానాలను మరింత బలపరచుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో 183 పరుగులు సాథించడం ద్వారా కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గాను, 171 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ సిరీస్‌లో కీలకంగా మారాడు. ఇందులో మ్యాచ్ విన్నింగ్ 119 పరుగులు నిర్ణయాత్మక మ్యాచ్‌లో సాధించి రోహిత్ తన స్థాయిని చాటాడు. ఈ నేపథ్యంలో కోహ్లి 886 పాయింట్లతో ర్యాకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని, రోహిత్ శర్మ 868 పాయింట్లతో రెండో స్థానాన్ని మరింతగా బలపరచుకున్నారు. ఈ సిరీస్‌లో కోహ్లీకి అదనంగా రెండు పాయింట్లు, రోహిత్‌కు అదనంగా మూడు పాయిం ట్లు దక్కాయి. కాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ శిఖర్‌ధావన్ సైతం రెండు ఇన్నింగ్స్‌లో 170 పరుగులు సాధించడం ద్వారా 7 పాయింట్లు మెరుగుపరచుకుని 15వ స్థానానికి ఎగబాకాడు. ఫీలింగ్ చేస్తూ గాయపడిన శిఖర్‌ధావన్ బెంగళూరు మ్యాచ్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెఎల్ రాహుల్ 21 స్లాట్స్ మెరుగుపరచుకుని 50వ స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడి జట్టులోకి తిరిగివచ్చిన బుమ్రా 764 పాయింట్లతో బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజీల్యాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆఫ్గనిస్తాన్ బౌలర్ ముజీబుర్ రహమాన్ బుమ్రా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన కాగిసో రబాడా, ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమ్మిన్స్ తొలి ఐదు ర్యాంకుల్లోకి చేరారు.
''చిత్రాలు.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ