క్రీడాభూమి

గత ఏడాదిలాగే.. న్యూజిలాండ్‌ను ఇరుకున పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: గడచిన ఏడాది న్యూజీలాండ్‌లో అద్భుత ఆటతీరుతో విజయాలను కైవసం చేసుకోవడంతోబాటు తాజాగా బలమైన ఆస్ట్రేలియా జట్టుపై సిరీస్ విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. ఈక్రమంలో ఈనెల 24 నుంచి జరిగే న్యూజీలాండ్ పర్యటనకు రెట్టించిన ఆత్మ విశ్వాసంతో సంసిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో బ్లాక్ క్యాప్స్‌ను కోహ్లీ సేన వత్తిడికి గురచేయడం ఖాయమని క్రీడా పండితులు భావిస్తున్నారు. న్యూజీలాండ్ పర్యటనలో మొత్తం ఐదు టీ 20 మ్యాచ్‌లు, మూడు వన్‌డే మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌లు భారత-న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగనున్నాయి. ఇటీవల ముగిసిన న్యూజీలాండ్ టూర్‌లో భారత జట్టు వన్ డే సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకోవడం జరిగింది. ఐతే టీ 20 సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో జారవిడుచుకుంది. ఈక్రమంలో జట్టు సారధి విరాట్ కోహ్లి ఆదివారం నాటి రాత్రి ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ‘గత ఏడాది న్యూజీలాండ్‌లో మా ప్రదర్శన మంచి ఆత్మవిశ్వాసాన్ని సంతృప్తిని నింపింది. ప్రస్తుతం జట్టు మొత్తం సానుకూల దృక్ఫథంతో ఉంది. ఈ దఫా పర్యటనలోనూ అది కొనసాగుతుంది’ అని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన విజయాన్ని నిర్ణయించే మూడో టీ 20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం కోహ్లీ మరింత ఆనందంగా కనిపించాడు. ‘సొంత గడ్డపై విజయాలను నమోదు చేయాలని ఆతిధ్య జట్టు గట్టిగా కృషి చేస్తుంది. ఐతే జట్టు సభ్యులంతా పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తే న్యూజీలాండ్ జట్టును ఇరుకున పెట్టడం సులువే’ అన్నాడు. గత సంవత్సర టూర్‌లో న్యూజీలాండ్‌ను మధ్య ఓవర్లలో వికెట్లు పడగొట్టడం ద్వారా ఇరుకున పెట్టిన విషయాన్ని కోహ్లి గుర్తు చేశాడు. ఈ విషయంలో స్పిన్నర్ల పాత్ర ప్రశంసనీయమన్నాడు. అదే స్ఫూర్తి, వ్యూహాలతో ఈ సిరీస్‌లో ముందుకెళ్లాలని నిర్ణయించామన్నాడు. సోమవారం రాత్రి భారత జట్టు న్యూజీలాండ్‌కు తరలి వెళుతుందన్నాడు. ప్రతి మ్యాచ్‌ను ఇదే విజయాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లా భావించి ఆడాల్సి ఉంటుందని, ఈ టూర్‌ను ఆనందదాయకంగా ముగించాలని నిర్ణయించామని కోహ్లీ చెప్పాడు. తమ జట్టు ఆస్ట్రేలియా జట్టుతో ఆడిన చివరి రెండు మ్యాచ్‌లు చాలా క్లిష్టతరమైనవన్నాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు భారీ స్కోర్లు నమోదు చేసేందుకు బ్యాట్స్‌మన్ కృషి చేయాలి. తక్కువ సోరును డిఫెండ్ చేయాలనుకోవడం పొరబాటే అన్నాడు.
'చిత్రం... భారత జట్టు సారధి విరాట్ కోహ్లి