క్రీడాభూమి

ఆరోన్ ఫించ్ సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 25: బిష్ బాష్ లీగ్ (బీబీఎల్)లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగే డ్స్‌పై సిడ్నీ సిక్సర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (109) 68 బంతుల్లోనే 6 బౌండరీలు, 7 సిక్సర్లతో సెంచరీ సా ధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్లంతా విఫలం కావడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయ 175 పరుగులు చేసింది. టామ్ కుర్రాన్ 3 వికెట్లు తీ యగా, స్టీవ్ ఒకీఫ్, బెన్ ద్వార్‌షుయ స్‌లు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ సిక్సర్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. వికెట్ కీపర్, ఓపెనర్ జోష్ ఫిలిప్ (61)తో పాటు స్టీవ్ స్మిత్ (66, నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.