క్రీడాభూమి

మళ్లీ సిక్సర్‌తోనే ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్: న్యూజిలాండ్ సొంతగడ్డపై కోహ్లీసేన వరుసగా మరో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఆదివా రం జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచి ముందుగా బ్యాటిం గ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి పరుగు లు తీసేందుకు ఇబ్బంది పడింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయ కేవలం 132 పరుగులకు మాత్రమే పరిమి తమైంది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (33), కొలిన్ మున్రో (26), చివర్లో వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ (33) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన కివీస్ బ్యాట్స్‌మెన్లు ఓవర్‌కు 8 పరుగుల చొప్పున రాబట్టారు. దీంతో మరోసారి 200 మార్కును చేరేలా కనిపించింది. అయతే శార్దు ల్ ఠాకూర్ వేసిన బంతిని ఆడిన గుప్టిల్ కోహ్లీ పట్టిన అద్భుత క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. మొదటి వికెట్‌కు ఓపెనర్లు 48 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. గుప్టిల్ నిష్క్రమణ నుంచి న్యూజిలాండ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ కొలిన్ మున్రో సైతం శివమ్ దూబే బౌలింగ్‌లో కోహ్లీకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించి ఫాంలో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14) కూడా క్రీజులో ఎక్కువసేపు కుదురుకోలేక పోయాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వరుసగా కొలిన్ డీగ్రాండ్ హోం (3), రాస్ టేలర్ (18) విఫలం కాగా, టిమ్ సీఫెర్ట్ (33) పరుగులు చేయడంతో న్యూజిలాండ్ స్కోరు వంద దాటింది. సీఫెర్ట్ చివరి వరకు క్రీజులో ఉండడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టగా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలు ఒక్కో వికెట్ తీశారు.
మళ్లీ విఫలమైన రోహిత్..
మొదటి టీ20లో కేవలం 7 పరుగులకే అవుటై నిరాశ పరిచిన టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (8) మరోసారి నిరాశ పరిచాడు. న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు పెద్దగా రాణించని రోహిత్ శర్మ తొలి ఓవర్‌లోనే టిమ్ సౌథీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి అదే ఓవర్‌లో అవుటయ్యాడు. దీంతో 8 పరుగులకే భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయంది. అనంత రం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (11) సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో గత మ్యాచ్ హీరోలు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. వీరిద్దరూ కివీ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. అందవచ్చిన బంతు లను బౌండరీలకు పంపుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ దశలో కేఎల్ రాహుల్ (57, నాటౌట్) టీ20లో తన 11వ అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (44) సైతం తనదైన శైలిలో ఆడి త్రుటిలో అర్ధ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 86 పరుగులను జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (8, నాటౌట్) సైతం చెలరేగి ఆడాడు. టిమ్ సౌథీ వేసిన 18వ ఓవర్‌లో మూడో బంతిని సిక్సర్‌గా మలిచి జట్టకు విజయాన్ని అందించాడు. న్యూజిలాం డ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోదీ 1 వికెట్ తీశాడు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
రాహుల్ సూపర్..
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌తో పాటు కీపర్‌గానూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గత ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే రాహుల్ వరుసగా 91, 45, 54, 56, 53 (నాటౌట్) నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు.

స్కోర్ బోర్డు..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సీ) కోహ్లీ (బీ) శార్దుల్ ఠాకూర్ 33, కొలిన్ మున్రో (సీ) కోహ్లీ (బీ) శివమ్ దూబే 26, కేన్ విలియమ్సన్ (సీ) చాహల్ (బీ) రవీంద్ర జడేజా 14, కొలిన్ డీగ్రాండ్ హోం (సీ) (బీ) రవీంద్ర జడేజా 3, రాస్ టేలర్ (సీ) రోహిత్ (బీ) బుమ్రా 18, టిమ్ సీఫెర్ట్ (నాటౌట్) 33, మిచెల్ శాంత్నార్ (నాటౌట్) 0. ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 132 (20 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-48, 2-68, 3-74, 4-81, 5-125.
బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 2-0-21-1, మహ్మద్ షమీ 4-0-22-0, జస్ప్రీత్ బుమ్రా 4-0-21-1, యుజువేంద్ర చాహల్ 4-0-33-0, శివమ్ దూబే 2-0-16-1, రవీంద్ర జడేజా 4-0-18-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) రాస్ టేలర్ (బీ) సౌథీ 8, లోకేష్ రాహుల్ (నాటౌట్) 57, విరాట్ కోహ్లీ (సీ) సీఫెర్ట్ (బీ) సౌథీ 11, శ్రేయాస్ అయ్యర్ (సీ) సౌథీ (బీ) ఇష్ సోదీ 44, శివమ్ దూబే (నాటౌట్) 8.
ఎక్స్‌ట్రాలు: 7 మొత్తం: 135 (17.3 ఓవర్లలో 3 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-8, 2-39, 3-125.
బౌలింగ్: టిమ్ సౌథీ 3.3-0-20-2, హమిష్ బెనె్నట్ 3-0-29-0, బ్లేయర్ టిక్‌నర్ 3-0-34-0, మిచెల్ శాంత్నార్ 4-0-19-0, ఇష్ సోదీ 4-0-33-1.
'చిత్రం...కేఎల్ రాహుల్ (57, నాటౌట్)