క్రీడాభూమి

ఓటమి పాలైన భారత మహిళల హాకీ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్, జనవరి 27: భారత మహిళల హాకీ జట్టు న్యూజీలాండ్ పర్యటనలో భాగంగా సోమవారం నాడిక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో 1-2 స్కోరుతో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్ డెవలప్‌మెంట్ స్క్వాడ్ జట్టును భారత జట్టు 4-0 స్కోరుతో ఓడించడం జరిగింది. కాగా సోమవారం రెండో మ్యాచ్‌ను న్యూజీలాండ్ జట్టు దూకుడుగా ఆరంభించింది. అటాకింగ్‌తో ఆరంభ కార్వర్టర్‌లో ఓ పెనాల్టీ కార్నర్‌ను సాధించింది. ఐతే భారత జట్టు కూడా రెండు, మూడు క్వార్టర్లలో తేరుకుని దీటైన పోటీనిచ్చింది. ఐతే రక్షణాత్మక వైఖరికే అధిక ప్రాధాన్యత నిచ్చిన భారత జట్టు అందుకు మ్యూల్యం చెల్లించుకుంది. ప్రత్యేకించి ఫైనల్ క్వార్టర్‌లో చివరి 15 నిమిషాల్లో చేసిన పొరబాటు వల్ల న్యూజీలాండ్‌కు మరో పెనాల్టీ కార్నర్ దక్కింది. ఆ జట్టులోని మెగాన్ హల్ ఎలాంటి పొరబాటు లేని అద్భుతమైన స్ట్రోక్‌తో తన జట్టుకు విజయాన్ని అందించింది. ఈ పరిణామంతో భారత జట్టు చీఫ్ కోచ్ స్జోయర్డ్ మారిజ్ని తీవ్ర నిరాసక్తతకు గురైంది. ‘మాజట్టు మంచి స్కోరింగ్ అవకాశాలను రూపొందించుకున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని, గత మ్యాచ్ అనుభవంతో న్యూజీలాండ్ జట్టు కొన్ని మార్పులు చేసుకుని విజయాన్ని సొంతం చేసుకుంద’ని ఆమె కితాబిచ్చింది. రాబోయే మ్యాచ్‌ల్లో మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించి విజయాలను దక్కించుకుంటామన్న ధీమా వ్యక్తం చేసింది.