క్రీడాభూమి

పట్టు బిగించిన ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహాన్స్‌బర్గ్, జనవరి 27: బౌలర్లు క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతులతో దక్షిణాఫ్రికా ఓపెనర్లను పెవిలియన్ దారి పట్టించడంతో సిరీస్‌లో నాలుగవది, చివరిది అయిన టెస్టు మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు సాధించింది. సిరీస్ విజయంపై కనే్నసింది. ఇక్కడి వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో సోమవారం లంచ్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. పీటర్ మలాన్, డీన్ ఎల్గర్ ఓపెనింగ్ జోడి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఊపుమీద కనిపించింది. ఐతే మిడ్ మార్నింగ్ డ్రింగ్ బ్రేక్ తర్వాత వోక్స్ వేసిన తొలి బంతిని డ్రైవ్ చేయబోయిన మలాన్ ఎడ్జ్ తీసుకోవడం ద్వారా సెకండ్ స్లిప్‌లో దొరికిపోయాడు. అప్పటికి అతని స్కోరు 22 పరుగులు. తర్వాత రస్సీ వాండర్ డస్సన్ వోక్స్ బౌలింగ్‌లోనే ఎల్‌బీడబ్ల్యుగా అవుటయినట్టు అంపైర్ ప్రకటించాడు. ఐతే రివ్యూలో బంతి ఆఫ్‌స్టంప్‌ను దాటి వెళుతున్నట్టు తేలడంతో డస్సెన్ క్రీజులో కొనసాగాడు. అటాకింగ్ స్ట్రోక్స్‌తో విరుచుకుపడి ఎల్గర్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతను లంచ్ సమయానికి 39 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అయితే ఎల్గర్ లంచ్‌కు ముందు 24 పరుగులకు అవుటయ్యాడు. స్టోక్స్ వేసిన బంతిని పుల్‌చేయబోయి టాప్ ఎడ్జ్ తీసుకోవడంతో అది సునాయాస క్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయానికి మొత్తం 466 సాధించాల్సి ఉంది. అదే జరిగితే ఇదో సరికొత్త ప్రపంచ రికార్డుగా నిలుస్తుంది. ఇంగ్లాండ్ ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యతతో ఉంది.