క్రీడాభూమి

పాక్-బంగ్లా మూడో టీ 20 రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జనవరి 27: బంగ్లాదేశ్-పాకిస్తాన్ జట్ల మధ్య సోమవారం నాడిక్కడ జరగాల్సిన మూడో టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రద్దు అయింది. రోజంతా వాతావరణ పరిస్థితులు మ్యాచ్‌కు అనుకూలించకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ సిరీస్‌ను ఆతిధ్య పాక్ జట్టుకు 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకుంది. ఇక్కడి గడాఫీ స్టేడియంలో ఉదయం నుంచి కురుస్తున్న తుంపర్లతోబాటు పెవిలియన్‌లో నిలిచిన మురుగునీరు కారణంగా మధ్యాహ్నం 1 గంటకు జరగాల్సిన టాస్ వేసేందుకు సైతం వీలు కాలేదు. దీంతో మరో మూడు గంటల తర్వాత మాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. కాగా గత శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో టీ 20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో 270 పాయింట్లతో అగ్ర స్థానానికి ఆస్ట్రేలియాతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో పోటీ పడుతోంది.