క్రీడాభూమి

రిషబ్ తిరిగి భారత జట్టులోకి వస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌లో మ్యాచ్ విన్నింగ్ సామర్ధ్యాలు పుష్కలంగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్, ఢిల్లీ ఐపీఎల్ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కితాబిచ్చాడు. అతను తిరిగి రెట్టించిన ఉత్సాహంతో జట్టులోని తొలి 11 మందిలో ఒకడుగా వస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం న్యూజీలాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు తొలి సిరీస్‌లోనే పంత్ ఆడతాడని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా ఇటీవల ముంబయిలో జరిగిన వన్‌డే మ్యాచ్‌లో తగిలిన బలమైన దెబ్బ కారణంగా స్పృహ కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను మళ్లీ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతని స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ అటు అంతర్జాతీయ వన్‌డేల్లో ఇటు టీ 20ల్లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కాగా ‘యువకుడైన రిషబ్‌లో మంచి టాలెంట్ దాగుందని రాబోయే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అతనితో కలిసి పనిచేసెందుకు తానెంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాన’ని ట్విట్టర్‌లో తన ఫాలోయర్స్‌తో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పాంటింగ్ పేర్కొన్నాడు. పాంటింగ్ ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2019 ఐపీఎల్ ఎడిషన్‌లో ఈ జట్టు ఏడేళ్ల తర్వాత తొలి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించడంలో రిషబ్‌పంత్ అపార ప్రతిబాపాటవాలు దాగున్నాయని పాంటింగ్ గుర్తు చేశాడు.
*చిత్రం...ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్, ఢిల్లీ ఐపీఎల్ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్