క్రీడాభూమి

కూలిన హెలికాప్టర్: 9 మంది మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజెల్స్: హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడగా, మృతుల్లో మాజీ దిగ్గజ బాస్కెట్ బాల్ (ఎన్‌బీఏ) క్రీడాకారుడు కోబె బ్రియాంట్ (41), అతని 13 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. లాస్‌ఏంజెల్స్ అధికారులు ఆదివారం ఇక్కడ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లాస్‌ఏంజెల్స్ కంట్రీ షరీఫ్ అలెక్స్ విల్లాన్యుఎవా అందించిన వివరాల మేరకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాద మృతుల్లో ఎనిమిది మంది ప్రయాణికులు, ఓ పైలట్ ఉన్నారు. ఆ హెలికాప్టర్‌లో ప్రయాణించిన వారిలో ఏ ఒక్కరూ జీవించి లేరని ఆమె స్పష్టం చేశారు.
కాగా లాస్‌ఏంజిల్స్ సబర్బన్ ప్రాంతంలోని కలబసాస్‌లో పొగ మంచుతో కూడిన వాతారణంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అగ్నిమాపక దళానికి ఉదయం 9.47 గంటలకు అందిందని, అక్కడి పర్వత పరీవాహక ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల మంటలు కూడా రేగాయని అధికారులు వివరించారు. కాగా మధ్యాహ్నం తర్వాత అక్కడ పొగమంచు తొలగిపోవడంతో పోలీసు శాఖకు చెందిన వాయు సహాయక బృందం హెలికాప్టర్లలో అక్కడికి చేరుకోగలిగిందని లాస్ ఏంజెల్స్ టైం పత్రిక తెలిపింది. సాధ్యమైనంత త్వరగా తామక్కడికి చేరుకోవాలని ప్రయత్నించినా అందుకు అక్కడి పరిస్థితులు ఏమాత్రం అనుమతించలేదని పోలీసు అధికారి జోష్ రుబెన్‌స్టెయిన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మృతుల్లో ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బ్రియాంట్‌తోబాటు అతని కుమార్తె గియాన్నా కూడా ఉన్నారని లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టీ స్పష్టం చేశారు. బ్రియాంత్ నలుగురు సంతానంలో గియాన్నా నాలుగవది. కాగా కుమార్తె గియన్నా ఆడాల్సిన ఓ మ్యాచ్ కోసం ఆమెతోబాటు కోబె బ్రియాంత్ ఈ హెలికాప్టర్‌లో తరలి వెళుతుండగా ప్రమాదం బారిన పడినట్టు తెలిసింది. కాగా స్థానిక మీడియా కథనం మేరకు మృతుల్లో మరో క్రీడాకారుడు, అతని తండ్రి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈక్రమంలో ఆరెంజ్ కోస్ట్ కళాశాల ఒక ప్రకటన వెలువరిస్తూ తమ బాస్కెట్ బాల్ కోచ్ జాన్ అల్టోబెల్లీ (56) సైతం మృతుల్లో ఉన్నారని వెల్లడించింది.
*చిత్రం... మాజీ దిగ్గజ బాస్కెట్ బాల్ (ఎన్‌బీఏ) క్రీడాకారుడు కోబె బ్రియాంట్ (41), అతని కుమార్తె గియాన్నా (ఫైల్‌ఫొటో)