క్రీడాభూమి

నన్ను అవమానించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూన్ 9: కేరళ క్రీడా శాఖ మంత్రి జయరాజన్ తనను కించ పరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఒలింపియన్ అంజూ బి జార్జి ఆరోపించింది. కేరళ క్రీడా మండలి (కెఎస్‌సి)కి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తాను అదే హోదాలో వివిధ అంశాలపై చర్చించడానికి జయరాజన్‌ను కలిశానని, ఆ సందర్భంలో ఆయన తనను యుడిఎఫ్ ఏజెంటుగానూ, అక్రమాలకు పాల్పడే వ్యక్తిగానూ అభివర్ణించి కించపరిచారని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. నిజనాకి తాను ఏ పార్టీకి చెందిన దానిని కానని తెలిపింది. గత యుడిఎఫ్ ప్రభుత్వం తనను కెఎస్‌సి అధ్యక్షురాలిగా నియమించిందని, తాను తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నానని తెలిపింది. అయితే, ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఎల్‌టిఎఫ్ ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న జయరాజన్ తనను యుడిఎఫ్‌కు చెందిన వ్యక్తినంటూ పరుషంగా మాట్లాడారని చెప్పింది. కెఎస్‌సిలో ఉన్నవారంతా అక్రమాలకు పాల్పడేవారని, వారు తీసుకునే చర్యలన్నీ చట్ట విరుద్ధమని జయరాజన్ వ్యాఖ్యానించారని తెలిపింది. తనకు క్రీడలు తప్ప రాజకీయాలతో పని లేదని స్పష్టం చేసింది. మంత్రి వైఖరిపై ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. కెఎస్‌సి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. తనతో పరుషంగా మాట్లాడినందుకే జయరాజన్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నానని, ఆతర్వాతే తుదపరి నిర్ణయం తీసుకుంటానని ఆమె ప్రకటించింది.
వారంలో రెండోసారి..
కేరళ క్రీడల మంత్రి జయరాజన్ వివాదాలోవ్ల చిక్కుకోవడం వారం రోజుల్లో ఇది రెండోసారి. ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ మృతి చెందినప్పుడు విలేఖరులు జయరాజన్‌కు వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ప్రస్తావించారు. అతని స్పందన అడిగారు. ఏమాత్రం తడుముకోకుండా ‘కేరళకు చెందిన ప్రముఖ బాక్సర్ అలీ మృతి చెందడం విషాదకరం’ అనడంతో విలేఖరులు కంగుతిన్నారు. అలీ అంటే ఎవరో తెలియని వ్యక్తి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నాడడం దారుణమని తిట్టుకుంటూ వెనుదిరిగారు. ఆ వ్యాఖ్యలతో నవ్వులపాలైన జయరాజన్ ఇప్పుడు అంజూపై నోరుపారేసుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.