క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు సాకేత్! అతనివైపే బొపన్న మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోవడానికి తెలుగువాడైన సాకేత్ మైనేనీ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. తనకు డబుల్స్ భాగస్వామిగా లియాండర్ పేస్ కాకుండా సాకేత్ ఉండాలని రోహన్ బొపన్న ప్రకటించడం ఆసక్తికరమైన పరిణామం. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) శనివారం సమావేశమై, బొపన్నకు భాగస్వామిగా ఎవరు ఉంటారన్నది నిర్ణయిస్తుంది. అయతే, ఎఐటిఎ అధికారులు సాకేత్ కంటే పేస్ మెరుగైన ఆటగాడని భావిస్తున్నట్టు సమాచారం. నిబంధనలను అనుసరించి పురుషుల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-10’లో స్థానం సంపాదించిన ఆటగాడికి తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. బొపన్న ‘టాప్-10’లో చేరడం ద్వారా రియోకు నేరుగా అర్హత సంపాదించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అతను మహేష్ భూపతితో కలిసి బరిలోకి దిగగా, ఇప్పుడు సాకేత్‌ను పార్ట్‌నర్‌గా ఎంచుకున్నాడు. ‘అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్రతిపాదనను ఎఐటిఎకు పంపాను. డబుల్స్ భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశం నాకు ఉంటుంది. అందుకే సాకేత్ పేరును సూచించాను’ అని బొపన్న ప్రకటించాడు. అయితే, తుది నిర్ణయం తీసుకునే అధికారం తమకే ఉందని ఎఐటిఎ చీఫ్ ఎగ్జికూటివ్ హిరణ్మయ్ చటర్జీ స్పష్టం చేశాడు. తమ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించేందుకు వీల్లేదన్నాడు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఒలింపిక్స్‌కు టెన్నిస్ జట్లను ఎంపిక చేస్తామని తెలిపాడు శనివారం ఎఐటిఎ సెలక్షన్ కమిటీ సమావేశమై, బొపన్న భాగస్వామిని నిర్ణయిస్తుందని చెప్పాడు. బొపన్న ప్రతిపాదనను సెలక్టర్లు పరిశీలిస్తారని, కానీ, దానిని అంగీకరించి తీరాలన్న నిబంధన ఏదీ లేదని తెలిపాడు. సాకేత్‌పై ఎఐటిఎ సానుకూలంగా లేదని అతని మాటలు స్పష్టం చేస్తున్నాయ. ఇలావుంటే, రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ బొపన్న పోటీపడతాడు. ఆ విభాగంలో అతనికి సానియా మీర్జా భాగస్వామిగా ఉంటుంది.