క్రీడాభూమి

భారత్, జర్మనీ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 10: ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసే అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టింది. లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత జర్మనీతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, దానిని నిలబెట్టుకోలేక, డ్రాతో సంతృప్తి చెందింది. ఇరు జట్లు చెరి మూడు గోల్స్ సాధించాయ.
మ్యాచ్ ఆరంభమైన ఏడో నిమిషంలోనే రఘునాథ్ చక్కటి గోల్ చేసి, భారత్ ఖాతా తెరిచాడు. అయతే, మరో ఎనిమిది నిమిషాల్లోనే జర్మనీకి గ్రాంబుచ్ టామ్ ఈక్వెలైజర్‌ను అందించాడు. జర్మనీ గోల్ చేసిన వెంటనే భారత్ ఆటగాళ్లు ఎదురుదాడికి ఉపక్రమించారు. జర్మనీ రక్షణ విభాగంలో తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. 26వ నిమిషంలో భారత్ ప్రయత్నం ఫలించింది. మన్దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. పైచేయని సాధించిన వెంటనే మరింత ఉత్సాహంతో దూకుడును కొనసాగించిన భారత్‌కు 32వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ద్వారా మూడో గోల్ లభించింది. ఈ అనూహ్య పరిణామంతో కంగుతిన్న జర్మనీ, అమీతుమీ తేల్చుకోవడానికి కృషి చేసింది. నాలుగు నిమిషాల్లోనే ఆ జట్టు ప్రయత్నం టామ్ రూపంలో సఫలమైంది. అతను తన రెండో గోల్‌ను సాధించడం ద్వారా భారత్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. దీనితో ఒత్తిడి నుంచి సులభంగానే బయటపడిన జర్మనీ ఈక్వెలైజర్ కోసం చెమటోడ్చింది. చివరికి 57వ నిమిషంలో జొనాస్ గోమోల్ సాధించిన గోల్‌తో స్కోర్లు సమమయ్యాయ. అప్పటి కే మ్యాచ్ ముగింపు దశకు చేరుకోవడంతో జర్మనీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకండా జాగ్రత్త పడింది. భారత్ కూడా దాదాపు అదే వ్యూహాన్ని అనుసరిం చింది. మరికొంత సేపు ఇదే రీతిలో ఆట కొనసాగితే, రక్షణ వలయాన్ని ఛేదించి జర్మనీ గోల్ చేస్తుందన్న అనుమానంతో చాలా జాగ్రత్తగా ఆడింది. చివరికి మ్యాచ్ డ్రా కావడంతో ఊపిరి పీల్చుకుంది. యువకులు ఎక్కువగా ఉన్న భారత్ ఈ ఏడాది ఆగస్టు మాసంలో జరిగే రియో ఒలింపిక్స్‌లో రాణించాల న్న పట్టుదలతో ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో దారుణంగా విఫలమై, చిట్టచివరి స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకున్న విషయాన్ని గుర్తుచేసు కుంటూ, అదే పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నది. అయతే, అవకాశాలను చేజార్చుకోవడం, గోల్స్ చేయడంలో విఫలం కావడం వంటి సమస్యలు భారత జట్టును వేధిస్తున్నాయ. పెనాల్టీలను రాబట్టుకోవడం, వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమవుతున్నది. ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.