క్రీడాభూమి

అలీకి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూయిస్‌విల్లే, జూన్ 10: వేలాది మంది అభిమానులు తరలిరాగా, లూయిస్‌విల్లేలో ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ అలీ ఈనెల మూడో తేదీన మృతి చెందగా, అతని స్వస్థలమైన లూయిస్‌విల్లేలో అంత్యక్రియలను నిర్వహించారు. అలీకి వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల ను తిలకించేందుకు టికెట్లు సంపాదించిన సుమారు 15,000 మంది అభిమానులు స్మశాన వాటికకు తరలి వచ్చారు. టికెట్ లేనివారు నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఊరేగింపును తిలకించి, ఆ మహాయోధుడికి అశ్రునివాళులర్పించారు. అలీ జన్మస్థానమైన ఈ నగరంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అంతిమ యాత్ర మొదలైంది. అలీ చిన్నతనంలో గడిపిన ఇంటిని ‘అలీ సెంటర్’గా ప్రకటించిన లూయిస్‌విల్లే అధికారులు దానిని ఆఫ్రికన్ అమెరికన్ వారసత్వ సంపదగా తీర్చిదిద్దారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అలీ అంత్యక్రియలకు హాజరుకాలేదు. అయితే, అలీకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఒక వీడియో మెసేజ్‌ను పంపారు. అమెరికా ఒక గొప్ప బాక్సర్‌ను, మానవతా వాదిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలీ కోట్లాది మంది అమెరికన్లను ప్రభావితం చేశాడని, ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
ఇలావుంటే, అలీ అంత్యక్రియలు ఇస్లామ్ సంప్రదాయం ప్రకారం జరిగాయి. మత పెద్దలు ‘దివ్య గ్రంధం’లోని సూక్తులు పఠిస్తూ, ఇస్లామిక్ విశ్వాసాలకు అనుగుణంగా అలీ అత్యక్రియల ప్రక్రియను పూర్తి చేశారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు, శే్వత జాతీయుల అహంకారానికి నిరసనగా కాసియస్ క్లే క్రిస్టియానిటీని విడిచిపెట్టి ఇస్లాం మతాన్ని స్వీకరించి, మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అదే పేరుతో అతను ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తిరుగులేని బాక్సింగ్ వీరుడిగా, గొప్ప మానవతా వాదిగా చరిత్రలో ఒక అధ్యాయాన్ని తన పేరుమీద లిఖించుకున్నాడు. ఆ మహాయోధుడి నిష్క్రమణతో ప్రపంచ బా క్సింగ్ రంగం వెలవెలబోతున్నది.

బెయర్‌స్టో సెంచరీ
ఇంగ్లాండ్ 416 ఆలౌట్
లార్డ్స్, జూన్ 10: శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 128.4 ఓవర్లలో 416 పరుగులు సాధించి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయ 162 పరుగులు చేసింది. అంతకు ముందు జానీ బెయర్‌స్టో అజేయ శతకంతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. అతను 251 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లతో 167 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, కెప్టెన్ అలిస్టర్ కుక్ 85, క్రిస్ వోక్స్ 66 చొప్పున పరుగులు సాధించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇప్పటికే 2-0 ఆధిక్యంతో గెల్చుకున్న ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్‌పై కనే్నయగా, లంక ఎలాగైనా వైట్‌వాష్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు కుశాల్ సిల్వ, దిముత్ కరుణరత్నే ఆచితూచి ఆడుతూ మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. 108 పరుగులు జోడించిన తర్వాత బెయర్‌స్టో క్యాచ్ అందుకోగా, స్టీవెన్ ఫిన్ బౌలింగ్‌లో కరుణరత్నే అవుటయ్యాడు. అతను 101 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుశాల్ మేండిస్‌తో కలిసి మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడిన కుశాల్ సిల్వ రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోరును వికెట్ నష్టానికి 162 పరుగులకు చేర్చాడు. అప్పటికి అతను 79 (139 బంతులు, 10 ఫోర్లు), మేండిస్ 25 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ కంటే లంక ఇంకా 254 పరుగులు వెనుకంజలో ఉంది. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయ.