క్రీడాభూమి

మాజీ ఫుట్‌బాలర్ అశోక్ చటర్జీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 22: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ ఫుట్‌బాలర్ అశోక్ చటర్జీ శనివారం ఇక్కడ మృతి చెందారు. మెర్డెకా కప్ చాంపియన్‌షిప్‌లో 1965, 1066 సంవత్సరాల్లో కాంస్య పతకాలను సాధించిన భారత జట్టులో ఆయన సభ్యుడు. 78 ఏళ్ల అశోక్ చటర్జీకి భార్య, కుమారుడు ఉన్నారు. 1965లో జరిగిన మెర్డెకా కప్ టోర్నమెంట్‌లో సెకండ్ హాప్ పీకే బెనర్జీకి సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టి, అశోక్ చటర్జీ తన అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టారు. జాతీయ జట్టుకు 30 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించిన ఆయన భారత ఫుట్‌బాల్ రంగానికి ఎనలేని సేవలు అందించారు. అశోక్ చటర్జీ మృతి తీరని లోటని, ఒక స్ఫూర్తిదాయకుడైన మార్గదర్శిని కోల్పోయామని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ కూడా అశోక్ చటర్జీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భారత సాకర్ రంగానికి చేసిన సేవలను గుర్తుచేశారు.

*మాజీ ఫుట్‌బాలర్ అశోక్ చటర్జీ (ఫైల్‌ఫొటో)