క్రీడాభూమి

దేశంలో క్రీడా విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, ఫిబ్రవరి 22: దేశంలో క్రీడా విప్లవం మొదలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మొట్టమొదటి ‘ఖేలో ఇండియా’ యూనివర్శిటీ గేమ్స్‌ను శనివారం ప్రారంభించిన మోడీ ప్రసంగిస్తూ, క్రీడా విప్లవంలో దీనిని తొలి అడుగుగా అభివర్ణించారు. 159 విశ్వవిద్యాలయాలకు చెందిన 3,400 మంది అథ్లెట్లు 17 విభాగాల్లో పోటీపడుతున్న మెగా టోర్నమెంట్ వల్ల యువతలో క్రీడాభిమానం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతర్జాతీయ వేదికలపై భారత్ అద్భుతంగా రాణించడానికి వీలుగా ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) వంటి ఎన్నో ప్రణాళికలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. క్రీడారంగంలో ఒక సరికొత్త రోజుకు ఒడిశాలో బీజం పడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఖేలో ఇండియా ప్రారంభం అనేది కేవలం చారిత్రక సంఘటన మాత్రమే కాదని, భారత క్రీడా భవిష్యత్తును నిర్దేశించే అపూర్వ ప్రయత్నమని అన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో భారత్ సత్తా నిరూపించుకుంటుందని ఇక్కడి జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఖేలో ఇండియాను ప్రారంభించిన మోదీ అన్నారు. యువ అథ్లెట్లు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఖేలో ఇండియా చక్కటి ప్లాట్ ఫామ్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ‘్భవిష్యత్తులో మీరు 200 స్వర్ణ పతకాలను దేశానికి సాధించి పెట్టే అవకాశం ఉంది. మీ నైపుణ్యానికి మరింత మెరుగు పెట్టుకోవచ్చు. ప్రమాణాలను పెంచుకోవచ్చు. మీ శక్తిసామర్థ్యాలను అత్యున్నత శిఖరాలకు చేర్చుకోవచ్చు’ అన్నారు. ‘మీరంతా ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని అనుకుంటున్నారు. కానీ, అంతకంటే ముఖ్యంగా మీతో మీరు పోటీపడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ శ్రమ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళుతుంది. కలలను నెరవేరుస్తుంది’ అన్నారు. మొట్టమొదటి ఖలో ఇండియాను నిర్వహించేందుకు ముందుకొచ్చిన ఒడిశా ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. యువ క్రీడాకారులను గుర్తించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఇలాంటి ఈవెంట్లు దోహదపడతాయని మోదీ వ్యాఖ్యానించారు. క్రీడాభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నిరుపేదలు, మధ్య తరగతికి చెందిన ఎంతో మంది క్రీడా రంగంలో తమకు ఉన్న ప్రతిభను నిరూపించుకోవడమేగాక, నైపుణ్యాన్ని మెరుగు పరచుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఖేలో ఇండియాను ఆలంబనంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ క్రీడా భవిష్యత్తు యువ అథ్లెట్ల చేతిలో ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు, పెట్రోలియం సహజవాయి శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌తోపాటు క్రీడా కార్యదర్శి రాధే శ్యామ్ జులానియా, ఏస్ స్ప్రింటర్, కేఐఐటీ విద్యార్థిని ద్యుతీ చంద్, మంగళూరు యూనివర్శిటీకి చెందిన ట్రిపుల్ జంపర్ జే షా, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ నరేంద్ర ప్రతాప్ సింగ్, పుణే వర్శిటీ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కోమల్ జగదాలే, ఆచార్య నాగార్జున వర్శిటీకి చెందిన స్ప్రింటర్ యరాజీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ