క్రీడాభూమి

బుమ్రా ఫామ్‌పై అనుమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత సూపర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో అతను ఒక్క వికెట్ కూడా సాధించలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బుమ్రాను సమర్థుడైన బౌలర్‌గా అంగీకరించడానికి వీల్లేదని అభిమానులు సైతం మండిపడ్డారు. అతనిపై వస్తున్న విమర్శలకు కారణం లేదని చెప్పడానికి వీల్లేదు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదుగానీ, ప్రస్తుతం మాత్రం అతని బౌలింగ్ ప్రమాణాలు మందగించాయనడంలో అనుమానం లేదు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన బుమ్రా మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత, అతని బౌలింగ్ తీరు గతంలో మాదిరి లేదని, పదును తగ్గడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడుతున్నారని పరిశీలకులు సైతం స్పష్టం చేస్తున్నారు. కెరీర్‌లో ఇంత వరకూ 12 టెస్టులు ఆడిన బుమ్రా 2,711 బంతులు వేశాడు. 1,193 పరుగులిచ్చి 62 వికెట్లు పడగొట్టాడు. 27 పరుగులకు ఆరు వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. 64 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను 3,346 బంతుల్లో, 2,541 పరుగులిచ్చి 104 వికెట్లు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ విశే్లషణ 27 పరుగులకు ఐదు వికెట్లు. ఇక టీ-20 ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే, 50 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 1,075 బంతులు వేసి, 1,195 పరుగులిచ్చి 59 వికెట్లు తీశాడు. 11 పరుగులకు మూడు వికెట్లు ఈ ఫార్మాట్‌లో అతని ఉత్తమ బౌలింగ్. గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ, అతను గతంలో మాదిరి నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అంతేగాక, వైవిధ్యం కూడా కనిపించడం లేదని, కాబట్టి, బ్యాట్స్‌మెన్ ఒకసారి అతని బౌలింగ్‌ను నిశితంగా గమనిస్తే, ఆతర్వాత చెలరేగిపోతారన్న వాదన కూడా ఉంది. రెండుమూడు మ్యాచ్‌లు లేదా ఒకటి రెండు సిరీస్‌ల్లో రాణించలేక పోయినంత మాత్రాన ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని, ప్రతి ఆటగాడూ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. సమర్థుడైన ఆటగాడు ఒకసారి ఆశించిన విధంగా రాణించలేకపోయినా, రెట్టింపు వేగంతో ఫామ్‌లోకి రావడం ఖాయమని అంటున్నారు. ఇలాంటి సందర్భాలు కోకొల్లలని స్పష్టం చేస్తున్న వీరి మాటలను కాదనలేం. అయితే, బౌలింగ్‌లో వైవిధ్యాన్ని తీసుకురావడం అనేది అనుకున్నంత సులభం కాదు. ఒక తీరుకు అలవాటు పడిన బౌలర్ రనప్‌నుగానీ, బంతిని డెలివరీ చేసే విధానాన్నిగానీ మార్చుకుంటే ఆశించిన ఫలితాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అనుమానస్పదమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా ఐసీసీ హెచ్చరికలను ఎదుర్కొన్న ఎంతో మంది పొరపాటును సరిదిద్దుకున్నప్పటికీ, గతంలో మాదిరి రాణించలేకపోయారన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అంతర్జాతీయ వేదికలపై ప్రయోగాలు చేయడం అనుకున్నంత సులభం కాదన్న వాదనను అంగీకరించక తప్పదు. బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోకపోయినా, దిశను నిర్దేశించుకోవడంలో సరైన విధానాలను అవలంభిస్తేగానీ బుమ్రా కెరీర్ మళ్లీ గాడిలో పడదు. ఈ ప్రయత్నంలో అతను ఎంత వరకూ సఫలమవుతాడో చూడాలి.

*చిత్రం... జస్‌ప్రీత్ బుమ్రా