క్రీడాభూమి

గట్టెక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీసేన రెండోఇన్నింగ్స్‌లోనూ అదే తడ ‘బ్యాటు’కు గురై, మరోసారి నిరాశ పరిచింది. ప్రస్తుతం మూడో రోజు ఆటలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
లంబూకు ఐదు..
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 216 పరుగులతో మూడో రోజు మొదటి ఇన్నింగ్స్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 348 పరుగుల వద్ద ఆలౌటైంది. కొలిన్ డీగ్రాండ్ హోం (43), కైల్ జెమీసన్ (44), ట్రెంట్ బౌల్ట్ చివర్లో రాణిం చారు. రెండో రోజు మూడు వికెట్లతో రాణించి న భారత పేసర్ ఇషాంత్ శర్మ , మూడు రోజు రెండు వికెట్లతో రాణించి మొత్తం 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్నర్ రవిచం ద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ తీశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 183 పరు గుల ఆధిక్యం లభించింది.
మారని ఆటతీరు..
తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే చాప చుట్టేసిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా ఆటను కనబరి చింది. జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ఓపెనర్ పృథ్వీ షా (16) వికెట్ ను కోల్పోయన టీమిండియా, ఆ తర్వాత కొద్దిసే పటికే చటేశ్వర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (19) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో నిలకడిగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చే సుకున్న మయాంక్ అగర్వాల్ (58) కూడా వెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్ 113 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయంది.
మళ్లీ రహానే..
ఈ క్రమంలో క్రీజులో ఉన్న అజింక్యా రహానే, హనుమ విహారిపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. వీరిద్దరూ ప్రస్తుతం నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకే తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నారు. అప్పటికే సమయం ముగియడం తో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లను కోల్పోయి 144 పరుగులు చేసింది. క్రీజులో అజిం క్యా రహానే (25), హనుమ విహారి (15) ఉండగా, కోహ్లీసేన ఇంకా 39 పరుగుల దూరంలో నిలిచింది.
జహీర్‌తో సమానంగా..
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించి టెస్టుల్లో 11వ సారి 5 వికెట్లు సాధించిన బౌలర్‌గా మాజీ ఆటగాడు జహీర్‌ఖాన్‌తో సమానంగా నిలిచాడు. జహీర్ 92 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా, ఇషాంత్ 97 టెస్టుల్లో దీనిని చేరుకున్నాడు. వీరిద్దరికంటే ముందు కపిల్‌దేవ్ అత్యధికంగా 23సార్లు 5 వికెట్లను తీసిన భారత బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. ఇక విదేశి గడ్డైనా కపిల్ దేవ్ (12) సార్లు ఐదేసి వికెట్లు తీయగా, అనిల్ కుంబ్లే (10) రెండో స్థానంలో నిలవగా, ఆ తర్వాత మూడో స్థానంలో ఇషాంత్ శర్మ (9) నిలిచాడు.