క్రీడాభూమి

భారత్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గురువారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మూడు పరుగుల తేడాతో ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మొదటి మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా సంచలనం సృష్టించిన భారత మహిళలు, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల ఆధిక్యంతో గెలిచారు. మూడో మ్యాచ్‌లో కివీస్ నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ, చివరికి విజయం భారత్ ఖాతాలోకి చేరింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేశారు. ఓపెనర్ షఫాలీ వర్మ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. వికెట్‌కీపర్ తానియా భాటియా 23 పరుగులు చేయగా, రాధా యాదవ్ 14, షిఖా పాండే 10 (నాటౌట్), జమీమా రోడ్రిగ్స్ 10, స్మృతి మందానా 11 చొప్పున పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో రోజ్‌మేరీ మైర్, అమెలియా కెర్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. లియా టహుహూ, సోఫీ డివైన్, లీ కాస్పెరెక్ తలా ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేయగలిగింది. చివరిలో కివీస్ క్రీడాకారిణులు తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడంతో, లక్ష్యానికి నాలుగు పరుగు దూరంలో నిలిచిపోయారు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో మాడీ గ్రీన్ 24, కాటీ మార్టిన్ 25, అమెలియా కెర్ 34 (నాటౌట్) చొప్పున పరుగులు చేసినప్పటికీ, తమ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హైలే జెనె్సన్ రనౌట్ కావడం న్యూజిలాండ్ విజయావకాశాలకు తెరదింపింది. భారత్ తరఫున దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ మైదానంలోకి దిగారు. అంతా తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
గ్రూప్ ‘ఏ’ నుంచి పోటీపడుతున్న భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడంతో, మొత్తం ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొని ఓడినప్పటికీ, ఆ తర్వాత రెండు వరుస విజయాలతో, నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బుధవారం ఆ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించింది. కాగా, ఇంత వరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ ఒక విజయం, మరో పరాజయంతో రెండు పాయింట్లు దక్కించుకుంది. చెరి రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా పాయింట్ల ఖాతాను తెరవలేదు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ మహిళల జట్టు: 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 (షఫాలీ వర్మ 46, తానియా భాటియా 23, రాధా యాదవ్ 14, రోజ్‌మెరీ మైర్ 2/27, అమెలియా కెర్ 2/21).
న్యూజిలాండ్ మహిళల జట్టు: 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 (మాడీ గ్రీన్ 24, కాటే మార్టిన్ 25, అమెలియా కెర్ 34 నాటౌట్, దీప్తి శర్మ 1.27, శిఖా పాండే 1/21, రాజేశ్వరి గైక్వాడ్ 1/22, పూనమ్ యాదవ్ 1/32, రాధా యాదవ్ 1.25).

*చిత్రం... కాటే మార్టిన్ వికెట్ సాధించిన భారత బౌలర్ రాధా యాదవ్ ఆనందం