క్రీడాభూమి

స్ప్రింట్‌లో దుతీకి స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఫిబ్రవరి 29: భారత ‘్ఫస్టెస్ట్ ఉమన్’ దుతీ చాంద్ ఇక్కడ జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మహిళల స్ప్రింట్‌ను సాధించింది. కళింగ్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) తరఫున బరిలోకి దిగిన 24 ఏళ్ల దుతీ రేస్ ప్రారంభం నుంచే ఆధిపత్యాన్ని కనబరచింది. లక్ష్యాన్ని 11.49 సెకన్లలో చేరుకొని స్వర్ణ పతకాన్ని అందుకుంది. మంగళూరు వర్సిటీకి చెందిన ధనలక్ష్మి 11.99 సెకన్లతో ద్వితీయ స్థానాన్ని సంపాదించింది. మహాత్మా గాంధీ వర్సిటీకిచెందిన స్నేహ 12.08 సెక న్లలో గమ్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా, గత ఏడాది 11.22 సెకన్లతో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన దుతీ ఈ లక్ష్యాన్ని 11.15 సెకన్లలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాలంటే అది కనీస అర్హత 11.15 సెకన్లు. అందుకే ఆమె క్వాలిఫయంగ్‌పై దృష్టి కేంద్రీకరించింది.
*చిత్రం... దుతీ చాంద్