క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌పై భారత్ ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 15: చాంపియన్స్ ట్రోఫీ హాకీలో మొదటిసారి ఫైనల్ చేరాలన్న ఆశతో, గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోరాటానికి సిద్ధమవుతున్నది. రెండు నెలల క్రితం ఇపోలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్నీలో ఆసీస్ చేతిలో భారత్ రెండు మ్యాచ్‌ల్లో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, ఇప్పుడు ప్రపంచ చాంపియన్ జట్టుకు షాకివ్వాలన్న పట్టుదలతో ఉంది. రౌండ్ రాబిన్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ చేరింది. దీనితో ఏ మాత్రం ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, బెంచ్ బలాన్ని పరీక్షించే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ ఆసీస్ ప్రయోగాలు చేస్తే, దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది భారత జట్టు వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ మ్యాచ్‌ని గెల్చుకుంటే, ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరులో ఆడే అవకాశాన్ని భారత్ దక్కించుకుంటుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే, ఫైనల్ చేరే అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. ఓడితే మాత్రం గ్రేట్ బ్రిటన్, బెల్జియం మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటిసారి చాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియాతో గురువారం జరిగే మ్యాచ్‌ని గెల్చుకోవాలని భారత్ భావిస్తున్నది. ఈ జట్టు తొలి మ్యాచ్‌లో జర్మనీని ఢీకొని డ్రాతో సంతృప్తి చెందింది. ఒకానొక దశలో 3-1 ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, దానిని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి అతి కష్టం మీద డ్రాతో సరిపుచ్చుకుంది. రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌ను 2-1 తేడాతో ఓడించినా, తర్వాతి మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దక్షిణ కొరియాపై 2-1 ఆధిక్యంతో విజయం సాధించి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇదే ఒరవడిని కొనసాగించి ఆసీస్‌ను ఓడించగలమన్న ధీమాతో ఉంది. ఆ ప్రయత్నం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.