క్రీడాభూమి

సాదికు సూపర్ గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిల్లీ (ఫ్రాన్స్), జూన్ 20: ఒక అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అల్బానియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆర్మాండో సాదికు సాధించిన గోల్‌తో ఈ జట్టు రుమేనియాపై 1-0 ఆధిక్యంతో విజయభేరి మోగించింది. ప్రత్యర్థిని చాలా తేలిగ్గా తీసుకున్న రుమేనియా సులభంగానే గోల్స్ సాధించవచ్చన్న ధీమాతో బరిలోకి దిగింది. అయితే, అల్బానియా రక్షణ వలయాన్ని ఛేదించడానికి తీవ్రంగా శ్రమించి విఫలమైంది. మ్యాచ్ 43వ నిమిషంలో మెరుపు వేగంతో ముందుకు దూసుకొచ్చిన సాదికు ఎవరూ ఊహించని విధంగా గోల్ చేశాడు. ఈ సూపర్ గోల్‌తో అల్బానియా ఆధిక్యాన్ని సంపాదించగా, ఈక్వెలైజర్ కోసం రుమేనియా పోరు కొనసాగింది. అయితే, మొదటి గోల్‌ను సాధించిన మరుక్షణం నుంచే అల్బానియా రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, రుమేనియాకు గోల్స్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఎక్‌స్ట్రా టైమ్‌లోనూ మరో గోల్ నమోదు కాకపోవడంతో అల్బానియా చారిత్రక విజయాన్ని సాధించింది.
ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మ్యాచ్ డ్రా
స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో గ్రూప్ ‘ఎ’ నుంచి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఫ్రాన్స్, స్విస్ ఆటగాళ్లు డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. దీనితో ఒక్క గోల్ కూడా నమోదు కాకుండా, మ్యాచ్ డ్రాగా ముగిసింది.