క్రీడాభూమి

ముర్రేకు క్వీన్స్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 20: బ్రిటన్ ఆటగాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే ఇక్కడ జరిగిన క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో అతను మిలోస్ రవోనిక్‌ను 6-7, 6-4, 6-3 తేడాతో ఓడించి, రానున్న వింబుల్డన్‌లో తాను గట్టిపోటీదారుడినని నిరూపించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన 29 ఏళ్ల ముర్రే మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ మిగతా రెండు సెట్లను సులభంగానే గెల్చుకొని టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 2013లో వింబుల్డన్ టైటిల్‌ను సాధించి చరిత్ర సృష్టించిన ముర్రే మరోసారి అదే ఫీట్‌ను ప్రదర్శించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ దూకుడుకు సమర్థంగా అడ్డుకట్ట వేయగల స్టార్‌గా ఇప్పటికే అతను పేరు తెచ్చుకున్నాడు. వేలాది మంది అభిమానుల సమక్షంలో వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్‌లో ఆడనున్న ముర్రేకు క్వీన్స్ క్లబ్ టైటిల్ స్ఫూర్తినిస్తోంది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 11 పర్యాయాలు విఫలయత్నం తర్వాత 12వసారి బరిలోకి దిగి టైటిల్ సాధించిన జొకోవిచ్‌కే ఈనెల 27 నుంచి మొదలుకానున్న వింబుల్డన్ కూడా అందుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. అయితే, అతనికి ముర్రే ఒక్కడే గట్టిపోటీదారుడవుతాడని చెప్తున్నారు. ముర్రే కూడా వింబుల్డన్‌లో తనకు విజయావకాశాలు లేకపోలేదని అన్నాడు. క్వీన్స్ క్లబ్ టోర్నీ ఫైనల్ ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ వింబుల్డన్‌కు తాను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. జొకోవిచ్ ప్రతిభావంతుడని అంగీకరించిన అతను తనను తేలిగ్గా తీసుకుంటే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.