క్రీడాభూమి
చీర కట్టడంలోనూ సానియానే నంబర్ వన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 June 2016
న్యూఢిల్లీ, జూన్ 20: టెన్నిస్ ఆడడంలోనే కాదు.. అందంగా చీర కట్టడంలోనూ హైదరాబాదీ సానియా మీర్జాను మించిన వారు లేరు. అంతర్జాతీయ ఎథ్నిక్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలో భారత జాతీయత ఉట్టిపడేలా అందంగా దుస్తులు ధరించే క్రీడాకారిణిగా సానియా 9.3 శాతం ఓట్లను సంపాదించుకుంది. మరో హైదరాబాదీ, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది. స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లీకల్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. చీర లేదా అనార్కలీ దుస్తులను క్రీడాకారిణుల్లో ఎవరు అందంగా ధరిస్తారన్న అంశంపై నిర్వహించిన ఓటింగ్‌లో సానియాకే ఓటర్లు పట్టం కట్టారు.