క్రీడాభూమి

కోపా అమెరికా ఫుట్‌బాల్ ఫైనల్‌కు చిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, జూన్ 23: కొలంబియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 2-0 ఆధిక్యంతో గెలిచిన చిలీ కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరింది. మ్యాచ్ ఏడో నిమిషంలోనే చార్లెస్ అరాంజిక్ చేసిన గోల్‌తో చిలీ ఖాతాను తెరిచింది. మరో మూడు నిమిషాల్లోనే జొస్ పెడ్రో ఫనె్జలిడా చేసిన గోల్‌తో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆతర్వాత చిలీ వ్యూహాత్మకంగా ఆడుతూ, డిఫెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చింది. గోల్స్ కోసం కొలంబియా ఎన్నిసార్లు దాడులకు ప్రయత్నించినప్పటికీ చిలీ రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయింది. ఫలితంగా మ్యాచ్‌ని గెల్చుకున్న చిలీ ఫైనల్‌లో అర్జెంటీనాతో పోటీపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కాగా సెమీ ఫైనల్స్‌లో ఓడిన అమెరికా, కొలంబియా జట్లు మూడో స్థానం కోసం జరిగే పోరులో ఢీ కొంటాయి.

చిత్రం చార్లెస్ అరాంజిక్