క్రీడాభూమి

కోమ్‌కు నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: భారత వెటరన్ బాక్సర్, కెరీర్‌లో ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న 33 ఏళ్ల మేరీ కోమ్‌కు రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఆమెను ఒలింపిక్స్‌కు పంపేందుకు భారత హాకీ అడ్‌హాక్ కమిటీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) నిరాకరించింది. అయితే, ఈ ప్రయత్నం విఫలమైనంత మాత్రాన రిటైర్ కావాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేసింది. అంతకు ముందు జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లో విఫలమైన కోమ్ నేరుగా ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించలేకపోయింది. దీనితో ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం కల్పించాలని కోరుతూ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ)కు అడ్‌హాక్ కమిటీ లేఖ రాసింది. ఇటీవల ఖజకస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్ 51 కిలోల విభాగంలో పోటీపడిన కోమ్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అంతకు ముందు జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లోనూ ఆమె విఫలమైంది. ఖజకస్తాన్‌లో తనకు లభించిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో రాజమార్గం మూసుకుపోయింది. ఫలితంగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ అనే దొడ్డిదారిన ఆమెను ఒలింపిక్స్‌కు పంపాలని అడ్‌హాక్ కమిటీ ప్రయత్నించింది. ఖజకస్తాన్ ఈవెంట్‌లో కనీసం సెమీ ఫైనల్ చేరినా కోమ్‌కు రియో వెళ్లే అవకాశం దక్కేది. కానీ, ఆమె సెమీస్ చేరలేక, ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. అయితే, వైల్డ్‌కార్డ్‌ను ఇప్పించడం ద్వారా ఆమెను రియోకు పంపాలని భారత బాక్సింగ్‌ను పర్యవేక్షిస్తున్న అడ్‌హాక్ కమిటీ అభిప్రాయపడింది. నిబంధనలను అనుసరించి, ఒలింపిక్స్‌లో జరిగే 51, 60, 75 కిలోల విభాగాలకుగాను కేవలం ఒకే ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని ఐఒసి అనుమతిస్తుంది. ఆ అవకాశాన్ని కోమ్ కోసం ఉపయోగించుకోవాలని అనుకున్న అడ్‌హాక్ కమిటీ తన ప్రతిపాదనను ఎఐబిఎకు పంపింది. ఐఒఎకు ఒక జాతీయ సమాఖ్య నేరుగా ప్రతిపాదనలు పంపే అవకాశం లేకపోవడంతో, ఎఐబిఎ ద్వారా కోమ్ పేరును వైల్డ్‌కార్డ్ కోసం పంపింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. ఎఐబిఎకు లేఖ రాసింది. ఐఒఎ సైతం మద్దతు తెలపడంతో కోమ్‌కు వైల్డ్‌కార్డ్ లభించడం ఖాయంగా కనిపించింది. కానీ సాంకేతిక కారణాలతో వైల్డ్‌కార్డ్‌ను జారీ చేయడానికి ఐఒఎ నిరాకరించింది. ఒలింపిక్స్‌లో ఏదైనా విభాగంలో పోటీ పడేందుకు తక్కువ సంఖ్యలో సభ్యులను పంపిన దేశాలకు మాత్రమే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ అవకాశం ఉంటుందని ఐఒఎ తన వివరణలో పేర్కొందని భారత బాక్సింగ్ అడ్‌హాక్ కమిటీ చైర్మన్ కిషన్ నర్సీ తెలిపాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఎనిమిది మంది బాక్సర్లు పాల్గొన్నందున రియో ఒలింపిక్స్‌లో వైల్డ్‌కార్డ్‌ను ఇవ్వడం లేదని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. కోమ్‌ను ఒలింపిక్స్‌కు పంపాలన్న తమ ప్రయత్నం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశాడు.

చిత్రం మేరీ కోమ్