రాష్ట్రీయం

అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 21: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్పోర్ట్సు విలేజ్‌ను నిర్మించనున్నామని, ఏ స్థాయి క్రీడలైనా సరే అమరావతిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. శనివారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా టెన్నీస్ అసోసియేషన్ నేషనల్ ర్యాంకింగ్ సిఎస్-3, అండర్ - 16 టెన్నీస్ టోర్నమెంటును ప్రారంభించిన అనంతరం విలేఖరులతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించనున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో క్రీడలకు సముచిత స్థానం కల్పించకపోవడంతో క్రీడలు మరుగున పడిపోయాయని, ఎంతో నైపుణ్యత కలిగిన క్రీడాకారులంతా నిరుత్సాహంతో కాలం గడిపారన్నారు. మరలా వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, పాఠ్యాంశంగా కూడా క్రీడలను చేర్చేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అచ్చెన్న చెప్పారు. ఇందు కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, అందులో తాము కూడా ఉన్నట్లు తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు.