క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి మాజీ నంబర్‌వన్ ముగురుజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: రెండు సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలిచిన గార్బెయిన్ ముగురుజా ఆస్ట్రేలియా ఓపెన్‌లో మళ్లీ మునుపటి ఫాంను ప్రదర్శించింది. తొమ్మిదో సీడ్ కికీ బెర్టన్స్‌ను 68 నిమిషాల్లోనే ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం అన్‌సీడెడ్‌గా ఉన్న ఈ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి 6-3, 6-3 సోరుతో ఓడించింది. ఈ టోర్నీలో ఆమె తదుపరి చివరి ఎనిమిది మందిలోని జర్మనీకి చెందిన 30వ సీడ్ అనస్టాసియాతో లేదా జర్మనీకి చెందిన 17వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్‌తో తలపడాల్సి ఉంది. ఈక్రమంలో టాప్ 10లోని ముగ్గురు మాత్రమే ఈ టోర్నీలో మిగిలారు. టాప్ సీడ్ ఆష్లై బర్టీ, ఏడో సీడ్ పెట్రా కిటోవా కార్టర్ ఫైనల్స్‌లో తలపడతారు. మరో టాప్ సీడ్ (నాలుగోసీడ్) సైమొనా హాలెప్ 28వ సీడ్ అనె్నట్ కొంటావియట్‌తో తలపడుతుంది. కాగా 18 నెలుగా కోల్పోయిన ఫాంను తిరిగి సంతరించుకోవడం పట్ల ముగురుజా ఆనందం వ్యక్తం చేసింది. ఈరోజు ఆటను తానెంతో ఆస్వాదించానంది.