స్పాట్ లైట్

తవాంగ్ సెగ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్ ప్రదేశ్ మరోసారి వివాదాలకు వేదిక కాబోతోంది. అక్కడి తవాంగ్‌లో దలైలామా జరుప తలపెట్టిన కార్యక్రమంపై చైనా నిప్పులు చెరుగుతోంది. లామాను అనుమతించవద్దంటూ డ్రాగన్ చేసిన హెచ్చరికల్ని భారత్ బేఖాతరు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న తవాంగ్‌లో ఏమి జరుగబోతోంది..లామాను అడ్డుకునేందుకు చైనా విసిరే తదుపరి పాచిక ఏమిటన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
**
టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు 14వ దలైలామా తవాంగ్ పర్యటన అంతర్జాతీయ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇప్పటికే అనేక సమస్యల కూపంలో కొట్టుమిట్టాడుతున్న ఇరు దేశాల మధ్య తవాంగ్ సెగ రగులుకుంది. దలైలామా రాకకోసం ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలను వినేందుకు తవాంగ్‌లోని వేలాది మంది వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో చైనా నిప్పులు చెరుగుతోంది. ఓ పక్క దలైలామాను దుయ్యబడుతూనే.. ఏప్రిల్ 5న జరుగనున్న ఆయన తవాంగ్ పర్యటనకూ అభ్యంతరాలు చెబుతోంది. లామాను తవాంగ్ వెళ్లనిస్తే ఇరు దేశాల సంబంధాలపైనే దీని ప్రభావం ఉటుందన్న డ్రాగన్ హెచ్చరికను భారత్ ఇప్పటికే కొట్టివేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు దలైలామాకు బలమైన సంబంధం ఉంది. 1959లో టిబెట్ నుంచి పరారైన ఆయన మొదట తవాంగ్‌లోకే ప్రవేశించారు. భారత్‌లోని అనేక ప్రాంతాలు తిరిగి చివరికి ధర్మశాలలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసలు దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో మొదలైన భారత్-చైనా వివాదం ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది.
దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌ను కేవలం ఏడు సార్లు మాత్రమే సందర్శించారు. కారణం ఆయన అరుణాచల్ ప్రదేశ్‌కు ఎప్పుడు వెళ్లినా చైనా నిప్పులు చెరగడమే.. భారత్‌తో అనవసరమైన కయ్యానికి కాలుదువ్వడమే! ఇప్పుడు దాదాపు అదే రకమైన పరిస్థితి ఇరు దేశాల మధ్య తలెత్తింది. ఏప్రిల్ 5న దలైలామా తవాంగ్ పట్టణంలోని ఇడిగా చోడ్‌జిన్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని భారత్ పదేపదే చెబుతున్నా.. అంతర్జాతీయ వేదికలపై ఇదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటించినా చైనా మాత్రం సన్నాయి నొక్కులు ఆపడం లేదు. అరుణాచల్‌ను వివాదాస్పద ప్రాంతంగానే పరిగణిస్తోంది. అందుకే దలైలామా తాజా పర్యటనకు అవరోధాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. టిబెట్ చైనాలో అంతర్భాగమని, అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ అన్నది చైనా వాదన. దాదాపు 80వేల చదరపు గజాల అరుణాచల్ భూభాగం తమదేనన్నది కూడా చైనా మొండి వాదన. 1962 యుద్ధ సమయంలో చైనా దళాలు అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొచ్చుకొచ్చి బీభత్స వాతావరణం సృష్టించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య సరిహద్దు సంఘర్షణలు అనివార్యంగా కొనసాగుతూనే ఉన్నాయి.

చిత్రం..2009లో దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ను సందర్శించినప్పటి దృశ్యం

- బి.సుధ