స్పాట్ లైట్

‘గోడ’ దిగను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమ వలసలను అరికట్టడంలో రాజీ లేదంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపక్ష డెమోక్రాట్లతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన తాను సిద్ధమంటున్నారు. ముఖ్యంగా మెక్సికోనుంచే ఈ రకమైన వలసల ప్రభావం అత్యధికంగా ఉండటం వల్ల రెండు దేశాల మధ్య సరిహద్దును నిర్మించే వరకూ తాను విశ్రమించేది లేదన్న బలమైన సంకేతాలను ట్రంప్ అందించారు. అంతేకాదు, ఇందుకు సంబంధించి భారీ ఎత్తున నిధుల సేకరణను చేపట్టడమే కాకుండా డెమోక్రాట్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో సహకరించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వంద రోజుల పాలనను పూర్తిచేసుకోబోతున్న ఆయన ఇప్పటివరకు తాము సాధించిన విజయాలను ఏకరువు పెట్టడంతో పాటు సాధించాలనుకున్న బృహత్ కార్యాలను కూడా జనం ముందుకు తెస్తున్నారు. అమెరికా, మెక్సికోల మధ్య సరిహద్దు గోడను నిర్మించాలంటే అంత తేలికైన వ్యవహారం కాదు కాబట్టి అందుకు బడ్జెట్ పరంగా ప్రభుత్వమే నిధులు కేటాయించాలన్నది ట్రంప్ ఆలోచన. అమెరికాలోకి మాదక ద్రవ్యాల ప్రవాహం ఆగాలంటే ఇక్కడి యువత భ్రష్టు పట్టి పోకుండా ఉండాలంటే మెక్సికో సరిహద్దుల్లో గోడను నిర్మించడమన్నది ఎంతైనా అవసరమన్న చెబుతున్న ట్రంప్ ఈ విషయంలో ఎలాంటి సవాలు ఎదురైనా వెనుకాడేది లేదంటున్నారు. అయితే ట్రంప్ ఆలోచనలకు ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సరిహద్దు గోడ నిర్మాణానికి అయ్యే భారీ వ్యయాన్ని బడ్జెట్ కేటాయింపులతో భర్తీ చేసుకోవడమన్నది ఎంత మాత్రం సమంజసం కాదని వాదిస్తున్న డెమోక్రాట్లు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఖరాఖండీగా చెబుతున్నారు. తాను సొంతంగా నిధులను సమకూర్చడంతో పాటు మెక్సికో నుంచి కూడా ఈ గోడ నిర్మాణానికి నిధులను సేకరించాలన్న ట్రంప్ ఆలోచనలు ఏ మేరకు సాకారమవుతాయన్నది అనుమానంగానే కనిపిస్తున్నది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుంచీ ట్రంప్ విధానాలను ఆలోచనలను డెమోక్రాట్లతోపాటు అమెరికా సమాజంలోని అనేక వర్గాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హెచ్-1బి వీసాల విషయంలోనూ, అక్రమ వలసల నిరోధానికి సంబంధించి ఆయన చేపట్టిన నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. జనంలో పేరుకుపోతున్న ఈ వ్యతిరేకతను తొలగించుకునేందుకు ట్రంప్ బృందం దేశవ్యాప్తంగా పర్యటనలకూ సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణం విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీలేదన్న బలమైన సంకేతాన్ని ట్రంప్ అందించబోతున్నారు. అక్రమ వలసలు ఆగాలంటే ఈ గోడ నిర్మాణాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టి తీరాల్సిందేనని చెబుతున్న ఆయన ఇందుకోసం అన్ని వర్గాల ప్రజల ఆమోదాన్నీ సహాయ సహకారాలను పొందగలనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు గోడ విషయంలోనే కాకుండా అనేక సబ్సిడీలకు సంబంధించి కూడా సమస్యల మయంగా ఉన్న పరిస్థితులను ట్రంప్ ఏవిధంగా అధిగమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వంద రోజుల విజయోత్సాహం ట్రంప్‌కు తదుపరి జయాలను చేకూర్చిపెడుతుందా లేక మెక్సికో కూడా భారీ అడ్డంకిగా మారి ఆయన వలసల విధానానికి తూట్లు పెడుతుందా అన్నది వేచిచూడాల్సిందే.