స్పాట్ లైట్

సార్క్‌కు ముసురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ -పాకిస్తాన్‌ల మధ్య ఇటీవలి కాలంలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో దాని ప్రభావం త్వరలో జరగనున్న సార్క్ సమావేశాలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేకసార్లు సార్క్ ఉనికినే ప్రశ్నార్థకం చేసే రీతిలో భారత్ పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో ఈ దక్షిణాసియా ప్రాంతీయ సంస్థ దేశాల్లో కూడా ఒకరకమైన నిర్లిప్తత చోటుచేసుకునే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా గత ఏడాది ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సును భారత్ బహిష్కరించటంతో పరిస్థితి మరింతగా ముదురుపాకాన పడింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ దుర్నీతిని, ఉగ్రవాదానికి అది ఇస్తున్న మద్దతును భారత్ ఎండగట్టడంతో రాబోయే సార్క్ సమావేశాలు జరుగుతాయా లేదా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఏకరంగా చూసినా కూడా మొదట్లో ఉన్నంత ఆసక్తి, పట్టుదల సార్క్ సభ్య దేశాల్లో రానురాను కొరవడుతోంది. 80వ దశకంలో బలమైన ప్రాంతీయ కూటమిగా ఏర్పడిన సార్క్ దేశాలు, అంనతరం కాలంలో అంతర్జాతీయంగా కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినా కీలక భూమిక పోషిస్తున్న భారత్ -పాక్‌ల మధ్య తలెత్తిన వైరం దీనిపైన తీవ్ర ప్రభావానే్న కనబర్చింది. గత ఏడాది మాదిరిగా రాబోయే సార్క్ సదస్సు కూడా నీరుగారిపోయే పక్షంలో ఈ బలమైన ప్రాంతీయ సంస్థ ఏమవుతుందన్న ఆందోళన చెలరేగుతోంది. కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఓ పక్క పాకిస్తాన్‌లో సయోధ్యను కొనసాగిస్తూనే ఉగ్రవాదానికి అది ఇస్తున్న మద్దతును భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వచ్చింది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో పాక్ వాదన అంతా కూడా నిరుపయోగమన్న రీతిలోనే ఐరాసలో కూడా భారత్ తెగేసి చెప్పింది. ఎప్పుడు జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించటం, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పాక్ పట్టుబట్టడం అన్నది ఓ ఆనవాయితీగా మారిందే తప్ప, దానిపై ఇంతవరకూ చర్చ జరిగిన దాఖలాలే లేవు. అయినప్పటికీ కూడా అదేపనిగా భారత్‌ను ఇరకాటంలో పడేసే రీతిలోనే ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పావులు కదుపుతూనే వచ్చింది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఐరాస వేదికగానే కాకుండా, అనేక ప్రాంతీయ కూటములతోను, దేశాలతోను జరిపిన చర్చల్లో ఉగ్రవాదానే్న ప్రధానంగా ప్రస్తావించి దాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగానో ప్రోత్సహిస్తున్న పాక్‌వంటి దేశాలను నిలదీయాలంటూ విస్పష్టంగానే సంకేతాలు అందించారు. గత ఏడాది సార్క్ సమావేశాలను భారత్ బహిష్కరించడానికి ప్రధాన కారణం అంతకుముందు కాశ్మీర్‌లోని యురీపై ఉగ్రవాదులు దాడి చేయడమే. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టేందుకు లేదా తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకైనా సార్క్ రాబోయే సమావేశాలను బహిష్కరించడానికే పాకిస్తాన్ మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మాత్రం ఈ ప్రాంతీయ సంస్థ క్రమంగా నీరుగారినట్టే అవుతుంది. ఓపక్క ఐరోపా యూనియన్, ఆసియాన్ వంటి కూటములు ప్రాంతీయ శక్తితో అంతర్జాతీయంగా తమ ఉనికికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సభ్యదేశాలుగా పరస్పరం సహకరించుకుంటూ, విశ్వవేదికపైనా తమ ఉమ్మడి ఉనికిని చాటుకుంటూ ఆర్థిక సత్తాను నిరూపించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో సార్క్ సభ్య దేశాలు వైమనశ్యాలను, స్పర్థలను, విభేదాలను పక్కనబెట్టి పరస్పరం సహకరించుకోవాల్సింది పోయి దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ దక్షిణాసియా ప్రాంతీయ సౌధం కూలిపోవడానికి ఆస్కారం ఇచ్చినట్టే అవుతుంది. భారత్ వినా సార్క్ కూటమిలోని దేశాలన్నీ చిన్న దేశాలే. ఇందులో మరో ప్రధాన దేశంగావున్న పాకిస్థాన్‌తో భారత్ నిరంతరం ఉగ్రవాద సమస్య రావణకాష్టంలా మారుతుండటం వల్ల కీలక దేశాలే కొట్టుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఈ విభేదాల వల్లే సార్క్ దేశాల మధ్య కూడా వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఎప్పటికప్పుడు అడుగంటిపోతూ వచ్చాయి. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో సార్క్ కూటమి వాటా కేవలం రెండు శాతమే కావడం ఈ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. అదేవిధంగా ఇతర దేశాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతుంటే, సార్క్ దేశాల్లోకి కేవలం 1.7 శాతం మాత్రమే. ప్రపంచస్థాయితో పోలిస్తే ఈ పెట్టుబడులు రావడం ఈ పరిస్థితి దయనీయతకు అద్దంపడుతుంది.
సార్క్ కూటమిని రక్షించాల్సిన బాధ్యత ఒక్క భారత్‌పైనే లేదు. దీని ఏర్పాటులో భారతే కీలక పాత్ర వహించినప్పటికీ, సభ్యదేశాలు తలోదారి అయ్యే పక్షంలో భారత్ కూడా ఈ బాధ్యతను నెత్తికెత్తుకునే పరిస్థితి ఎంతమాత్రం ఉండే అవకాశం లేదు. ఇతర ప్రాంతీయ కూటములు శక్తివంతం కావడానికి, అందులో భారత్ కూడా ప్రధాన భాగస్వామ్యం పొదండానికి ప్రధాన కారణం సార్క్ కూటమి ఎప్పటికప్పుడు నీరుగారిపోయే పరిస్థితి తలెత్తడమే. ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో ఏ ఒక్కదేశం తనంతట తానుగా మనుగడ సాగించే అవకాశం లేదు. పరస్పర సహకారం, సామరస్యపూర్వక సంబంధాలు, సయోధ్య నెలకుంటేనే సాధ్యమవుతుంది. కూటమిగా ఏర్పడిన సార్క్ దేశాల్లో ఈ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పాక్ ఉగ్రనీతిని విడనాడనంత వరకూ సార్క్ బలంగా నిలబడే అవకాశం లేదన్నది ఎంతైనా నిజం. దీన్ని కాపాడుకుంటారా? లేక సభ్య దేశాలు తలోదారిలో తమ మనుగడ వెతుక్కుంటాయా? అన్నది సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది.

మోదీ, షరీఫ్ (ఫైల్ ఫొటో)