స్పాట్ లైట్

కన్నీటి బాల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమాఫ్రికాలో పిల్లలే మిలిటెంట్ల పావులు ఆత్మాహుతి బాంబర్లుగా ప్రయోగం
ఫలించని యునిసెఫ్ ప్రయత్నాలు అంతర్యుద్ధంతో లక్షలాదిమంది నిరాశ్రయులు

పశ్చిమాఫ్రికాలో బాల్యం ఆత్మాహుతి దాడులకు బలవుతోంది. వైరివర్గాల ఘాతుకాలకు బాలబాలికలే ఆయుధాలుగా మారుతున్నారు. నైజీరియా, నైగర్, చాద్, కామెరూన్ వంటి దేశాల్లో దీర్ఘకాలంగా జరుగుతున్న అంతర్యుద్ధాల్లో పిల్లలను ఆత్మాహుతి బాంబర్లుగా ప్రయోగించడమన్నది ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. మూడేళ్ల క్రితం నైజీరియాలో బొకోహారమ్ 276మంది బాలికలను అపహరించి వారితోనే ప్రత్యర్థులపై ఆత్మాహుతిదాడులను చేయించడమన్నది ప్రపంచవ్యాప్తంగా హడలెత్తించింది. ఇటీవలి కాలంలో పశ్చిమాఫ్రికాలో ఈ విష సంస్కృతి మరింత తీవ్రమైందంటూ యునిసెఫ్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. గత మూడు సంవత్సరాల్లో 117మంది పిల్లలు నైజీరియా, నైగర్, చాద్, కామెరూన్ దేశాల్లో జరిగిన ఆత్మాహుతి దాడులకు ఆయుధాలుగా మారిపోయారు. వీరిలో 80 శాతంమంది బాలికలే కావడం తక్షణమే పశ్చిమాఫ్రికా పరిస్థితులపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాల్సిన అవసరాన్ని చాటిచెప్తోంది. ఆత్మాహుతి దాడులకు పిల్లలను వినియోగించడమన్నది గతంలో ఎక్కడా చూడని పరిణామం. బొకోహారమ్ అనే మిలిటెంట్ సంస్థ ఏ రకంగా తన పట్టును సంపాదించుకోవడానికి పిల్లలను బలి చేస్తోందో ఈ ఉదంతాలే తార్కాణం. ప్రస్తుత ఏడాదిలో కూడా ఈ రకమైన సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఈ నాలుగు దేశాల్లో జరిగిన అనేక బహిరంగ ఆత్మాహుతి దాడులకు పిల్లలే ఆయుధాలుగా మారడం దిగ్భ్రాంతి కలిగించేదేనని యునిసెఫ్ తేటతెల్లం చేస్తోంది. 2014లో 276మంది పిల్లలను బొకోహరమ్ మిలిటెంట్ సంస్థ ఓ పాఠశాల నుంచి కిడ్నాప్ చేసింది.
ఆనాటి ఘటనలో కొందరు తప్పించుకున్నా గత ఏడాది 21మందిని ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం విడుదల చేసింది. నైజీరియా రక్షణ మంత్రి మనీర్ అలీ లెక్కల ప్రకారం ఇంకా 195మంది బాలికలు బొకోహరమ్ నిర్బంధంలోనే ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. అసలు ఈ పిల్లలు ఏమయ్యారు? వారి ఆచూకీ ఏమిటన్నది ఏళ్లు గడుస్తున్నా అంతుబట్టనిదిగానే మారింది. పశ్చిమాఫ్రికాలో ఈ అంతర్యుద్ధాల కారణంగా 13లక్షల మంది బాలబాలికలు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామందిది దిక్కూమొక్కూ లేని బతుకేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతూ పొంతూ లేని హింసాకాండ, ఎప్పుడు ఆగుతుందో తెలియని అంతర్యుద్ధం, బాల్యాన్ని నిర్భాగ్యంగా మారుస్తున్నాయి. అక్కడి పరిస్థితులు ఎప్పుడు కొలిక్కివస్తాయి? బాలబాలికల భవితకు భరోసా ఎప్పుడు లభిస్తుంది? అన్నది ఎండమావిగానే కనిపిస్తోంది. బొకోహరమ్ నిర్బంధంలో ఉన్న పిల్లలు వేల సంఖ్యలోనే ఉంటారని, వీరిని విడిపించి వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి యునిసెఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నీ సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. నిరాశ్రయులైన లక్షలాదిమంది పిల్లలను ఆదుకోవడంతో పాటు వారికి పౌష్టికాహారాన్ని అందించడానికి, విద్యాబుద్ధులు నేర్పించడానికి, వారి ఆరోగ్యాన్ని సంరక్షించడానికి మిలియన్ల కొద్దీ డాలర్ల వ్యయం అవుతుందని అంతర్జాతీయ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఇందుకోసం భారీగానే విరాళాలు సేకరించినప్పటికీ అవి సక్రమంగా వినియోగం అవుతున్న సంకేతాలు కనిపించడం లేదు. ఇక భద్రతాపరమైన అంశాల విషయానికొస్తే ఆశించింది కొండంత, సాధించింది గోరంత అన్న చందంగానే పశ్చిమాఫ్రికా పరిస్థితులున్నాయి.
ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మిలిటెంట్ సంస్థలకు పసిపిల్లలే ఆత్మాహుతి దాడులకు పావులుగా మారడం వల్ల ఎవరూ ధైర్యంగా ముందుకురాని పరిస్థితి తలెత్తింది. ఇటీవలి ప్రయత్నాల కారణంగా కొంత బలహీన పడినప్పటికీ అనేక ప్రాంతాల్లో దీని పట్టు మాత్రం తగ్గలేదు. యునిసెఫ్ స్వయంగా రంగంలోకి దిగి సమీకృత ప్రయత్నాల ద్వారా ఇక్కడి పిల్లలను రక్షించేందుకు, వారికి భద్రతను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ముఖ్యంగా లక్షల సంఖ్యలో ఉన్న అనాథ బాలబాలికలకు చదువు చెప్పించడం, పౌష్టికాహారం అందించడమన్నది ఓ పెను సవాలుగానే మారుతోందన్న విషయాన్ని యునిసెఫ్ స్వయంగా అంగీకరించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు అనేక ప్రాంతాల్లోని పిల్లల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్న యునిసెఫ్ పశ్చిమాఫ్రికా సంక్షోభాన్ని తొలగించడానికి మరింత విస్తృత స్థాయిలో విరాళాల సేకరణ అవసరమని చెబుతోంది. భారీగా విరాళాలు ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చినప్పటికీ ఇప్పటివరకు 40శాతం నిర్దేశిత మొత్తం అందకపోవడం వల్ల పిల్లల సంరక్షణ, భద్రత వారికి భవితపై ధీమా కల్పించడమన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.