స్పాట్ లైట్

తీరు మారకుంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదటి నుంచీ కూడా అమెరికా సమాజానిది తుపాకీ సంస్కృతికి అనుకూలమైన ధోరణే. ఎన్ని ఘాతుకాలు జరిగినా, ఎంతగా రక్తం చిందినా గన్ లైసెన్సుల విషయంలో రాజీపడకుండానే అమెరికా ప్రజలు తమ మనుగడను సాధిస్తున్నారు. తాజాగా లాస్ వెగాస్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికా ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించేదే కాదు యావత్ ప్రపంచానికి అక్కడి తుపాకీ సంస్కృతి పట్ల మరింత వ్యతిరేకతను రగిలించేదే అవుతుంది. ఎప్పుడు అమెరికాలో ఈ రకమైన కాల్పులు జరిగినా సర్వత్రా గగ్గోలు చెలరేగుతుంది. విచ్చలవిడిగా తుపాకీ లైసెన్స్‌లు ఆపేయాలంటూ, ఇందుకు గట్టి నియంత్రణ పెట్టాలంటూ డిమాండ్లు పెరుగుతాయి. కానీ ఆ ఆవేశం, ఆందోళన, ఆగ్రహం కొన్ని గంటలవరకే ఉంటాయి. మళ్లీ మామూలుగా తుపాకీ లైసెన్సుల వ్యవహారం కొనసాగుతునే ఉంటుంది. మరో ఉన్మాది మరోచోట విచక్షణారహిత కాల్పుతలో రక్తం చిందించేవరకూ ఈ తుపాకీ సంస్కృతిని అమెరికా సమాజం పట్టించుకోదు. గతేడాది ఓర్లాండో నైట్ క్లబ్‌లో ఓ ఆగంతకుడు 49 మందిని విచక్షణారహితంగా కాల్చిచంపిన తరువాత అంతకంటే బీభత్సరీతిలో లాస్‌వెగాస్ ఘటన చోటుచేసుకుంది. బరాక్ ఒబాబా తన హయాంలో ఈ రకమైన ఘాతుకాలను తీవ్ర పదజాలంతో గర్హించారు. తుపాకీ సంస్కృతికి సంబంధించి అమెరికన్ల ఆలోచనల్లో మార్పు రావాలని, చేతిలో గన్ ఉంటేనే భద్రత అన్న భావనపోయి సామరస్యపూరిత వాతావరణాన్ని సమాజంలో పాదుగొల్పాల్సిన అవసరం ఉందని ఒబామా ఎన్నోసార్లు చెప్పారు. ఆయనే స్వయంగా ఇందుకు సంబంధించి ప్రజలను ఏకం చేయడానికి, విచక్షణారహితంగా తుపాకీల విక్రయాన్ని నిలిపివేయడానికి ప్రయత్నించారు.కానీ తరతరాలుగా ఈ గన్ సంస్కృతికి అలవాటుపడ్డ అమెరికన్లకు ఆయన మాటలు రుచించలేదు. మళ్లీ యధాతథంగా పరిస్థితి మొదటికి వచ్చింది. ప్రజల ఆలోచనల్లో మార్పు రానంత వరకూ ఏ నాయకుడు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉండదు. కేవలం సామూహిక హత్యాకాండలే కాకుండా విద్వేష నేరాలు కూడా అమెరికాలో ఈ తుపాకీ సంస్కృతి కారణంగా పెచ్చరిల్లుతున్న సంఘటనలు కోకొల్లలు. కేవలం ఈ ఘటనను ఖండించి చేతులు దులుపుకోకుండా తుపాకీతోనే భద్రత అన్న భావన నుంచి అమెరికన్లను బయటకు తీసుకురాగలగాలి. అప్పుడే ఈరకమైన ఘాతుకాలను చరమగీతం పాడే అవకాశం ఉంది.