స్పాట్ లైట్

కయ్యమే నైజమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హడలెత్తిస్తున్న ట్రంప్ నిర్ణయాలు ఇలా అయితే మూడో ప్రపంచ యుద్ధమే
ఇమ్మిగ్రేషన్ నుంచి ఉ.కొరియా వరకు అధ్యక్షుడిది ఇదే ధోరణి రిపబ్లికన్ సీనియర్ నేత తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఇంటా బయటా ఆయనకు సెగలు పుట్టిస్తోంది. ఇమ్మిగ్రేషన్ మొదలుకుని ఉత్తర కొరియా వరకు ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లే కాకుండా, ఇతర నాయకులు కూడా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఏదో ఒక దేశాన్ని హెచ్చరిస్తే తప్ప నిద్రపట్టని మనస్తత్వం ట్రంప్‌ది అంటూ తాజాగా సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ అధ్యక్షుడు బాబ్ కోర్కెర్ ధ్వజమెత్తడాన్ని బట్టి చూస్తే దేశాధ్యక్షుడి ధోరణి పట్ల ఎంతగా నిరసన వ్యక్తమవుతోందో అర్థమవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచ దేశాలకు ఉన్నతమైన ప్రమాణాలను అందించడంతోపాటు మార్గనిర్దేశనం చేయాల్సిన ట్రంప్ వైట్‌హౌస్‌ను ఏకంగా ‘రియాల్టీ షో’గా నడిపిస్తున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ట్రంప్ ఇదే తరహాలో వ్యవహరిస్తే మాత్రం మూడో ప్రపంచ యుద్ధాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుందన్న హెచ్చరికలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తమ పార్టీకి చెందిన దేశాధ్యక్షుడిపైనే రిపబ్లికన్ నాయకుడు ఇంత తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించడం అన్నది అమెరికా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. మిగతా దేశాలతో అమెరికా సంబంధాలు కూడా ట్రంప్ సారథ్యంలో అంతంతమాత్రంగానే మారాయి. కనీసం అన్ని పరిస్థితుల్లోనూ అమెరికాకు వెన్నుదన్నుగా వుండే మిత్రదేశాలను సైతం ఇరుకున పెట్టే రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నాటో దేశాల విషయంలో ఆయన మొదట్లో చేసిన వ్యాఖ్యలు ఎంతగా ఈ కూటమిలో కలకలం రేపాయో తెలిసిందే. అలాగే భూతాన్ని తగ్గించేందుకు పర్యావరణ సమతూకాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పందాన్ని కూడా ట్రంప్ తనదైన సహజ శైలిలో తూర్పారబట్టడం అన్నది విడ్డూర పరిణామంగానే ఓ సమున్నతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వ్యవహరించకూడని రీతిగానే ఉందన్నది వాస్తవం. అలాగే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఒబామా కేర్ విషయంలోనూ ట్రంప్ వ్యవహార శైలి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచీ మారు మాట్లాడని ఇరాన్ కూడా ఇటీవలి కాలంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును నిరసించింది. అసలు ఇరాన్ ఒప్పందమే వృథా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ దీన్ని రద్దు చేసుకుంటే మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ట్రంప్‌ను హెచ్చరించింది. అమెరికాలో అధికారంలో డెమొక్రాట్లున్నా, రిపబ్లికన్‌లు ఉన్న కూడా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిని అమితంగా గౌరవించడం జరుగుతుంది. అతడి మాటే వేదవాక్కుగా పాలనా వ్యవహారాలు సాగుతాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మాత్రం ఈ పరిస్థితి మారిపోయింది. రిపబ్లికనే్ల ఆయనపై దుమ్మెతిపోసే పరిణామాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. రాజకీయాల్లో తలపండిన వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేస్తే అతడు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. దాదాపు ముప్పావు వంతు జీవితాన్ని వ్యాపార కార్యకలాపాల్లోనే గడిపిన ట్రంప్‌నకు పాలనా వ్యవహారాలు కొత్త కావడమే కాకుండా ఇతరులతో ఆయన వ్యవహరించే తీరుకూడా తరచూ విమర్శనాత్మకంగా మారుతోంది. అసలు గొడవ ఆయనకు రిపబ్లికన్ పార్టీ నామినేషన్ ఇవ్వడంతోనే మొదలైంది. ట్రంప్ వద్దే వద్దంటూ రిపబ్లికనే్ల గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ కూడా అమెరికా ప్రజలు ఆయనకే పట్టంగట్టారు. అంతగా తనను కోరుకున్న ప్రజలను అక్కున చేర్చుకోవాల్సిన ట్రంప్ అంతర్గతంగా వివాదాలు రగిలించడంతోపాటు దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న వాటితోనే కయ్యానికి కాలు దువ్వే చందంగా వ్యవహరించడం అన్నది విడ్డూర పరిణామమే. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడే ట్రంప్‌పై తీవ్రంగా మాట్లాడారంటే, మొత్తం అధికార పార్టీ ఆయన తీరు పట్ల ఎంతగా విసుగెత్తిపోతోందో అర్థం చేసుకోవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం స్థారుూ భేదంతో నిమిత్తం లేకుండా అందరినీ ఒకే గాటన కడుతూ వ్యవహరిస్తున్న తీరు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన తీవ్రమవుతోంది. స్వంత పార్టీ నాయకుడు అన్నట్టుగా అధ్యక్షుడి వ్యవహర శైలి మూడో ప్రపంచ యుద్ధానికి బలవంతంగా నెట్టేసినా ఆశ్చపోవాల్సిన అవసరం లేదు.