స్పాట్ లైట్

ఎట్టకేలకు దిద్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్మార్‌లో నెలకొన్న రోహింగ్యాల సంక్షోభం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఆలస్యంగానైనా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. గత రెండు మూడు నెలలుగా మైన్మార్‌నుంచి ప్రాణభయంతో పరుగులు పెడుతున్న మైనారిటీ రోహింగ్యా ముస్లింల విషయంలో ఇటు ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పదిహేనేళ్లు పోరాడిన ఆంగ్‌సాన్ సూకీపై సైతం నిప్పులు చెరిగాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మత విద్వేషాలను చల్లార్చేందుకు అదేవిధంగా పారిపోతున్న మైనారిటీ ముస్లింలను ఆదుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు మైన్మార్ ప్రభుత్వం తక్షణ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు ఆరు లక్షలమంది మైన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు వలస పోయారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే మైనారిటీ ముస్లింలపై సైనిక దాడులు నిలిపివేయాలంటూ ఐరాస కూడా తాజాగా విజ్ఞప్తి చేసింది. పరిస్థితి ఏమాత్రం విషమించినా వలస వచ్చే లక్షలాది రోహింగ్యాలను భరించే శక్తి ఇరుగు పొరుగు దేశాలకు లేదన్న వాదనా వినిపిస్తోంది. ఇకనైనా దాడులను అరికట్టి సామరస్య పూర్వక వాతావరణాన్ని పెంపొందించడంలో ఆంగ్‌సాన్ సూకీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో వుందని నిపుణులు చెబుతున్నారు.