స్పాట్ లైట్

ముందుగానే సన్నద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడు అంతర్జాతీయ యుద్ధం జరిగినా అమెరికాకు వంతపాడే బ్రిటన్ ఇప్పుడు ఉత్తర కొరియా విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించబోతోందా? ఇరాక్‌పై యుద్ధం విషయంలో అమెరికా వాదనకు వంతపాడి అనంతరం దేశీయ పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని టోనీ బ్లెయిర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో అనంతరం యుద్ధానికి ఎప్పుడు అమెరికా సాయం కోరినా బ్రిటన్ అంతకు ముందులాగ పరుగెత్తుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉత్తర కొరియా అణు పరీక్షలు ప్రపంచ దేశాల్ని అట్టుడికిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ప్రపంచంపై మరో యుద్ధాన్ని రుద్దబోతోందా అన్న అనుమానాలకూ ఆస్కారాన్నిస్తోంది. ప్రపంచ దేశాలు ఎంతగా వారించినా..ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినా దారికి రాని ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాటల యుద్ధమే సాగిస్తున్నారు. వీరి ధోరణి ఇప్పటికే అన్ని సభ్యతా గీతలూ దాటేసి పరస్పరం దాడికి సిద్ధమన్న స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ఇక ఉత్తర కొరియాపై దాడి చేయడమే అమెరికా తదుపరి అడుగు అన్న ప్రచారమూ జరుగుతోంది. వీటితో నిమిత్తం లేకుండా బ్రిటన్ మాత్రం చాపకింద నీరులా తన ప్రయత్నాలు చేసుకుంటూ పోతోంది. ఒక వేళ యుద్ధమే జరిగితే..పరిస్థితి ఏమిటన్న ఆలోచనతో తన యుద్ధ వ్యూహానికీ పదును పెడుతోంది. ఇందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలనూ సిద్ధం చేస్తోంది. మంచి కంటే చెడును ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఎక్కువ నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉండదన్న ఉద్దేశంతో బ్రిటన్ తన కొత్త యుద్ధ నౌక హెచ్‌ఎమ్‌ఎస్ క్వీన్ ఎలిజిబెత్‌ను కొరియా ద్వీపకల్పానికి పంపేందుకు సిద్ధమవుతోంది. పరిస్థితి ఏ మాత్రం విషమించినా తాము వెనుకబడి ఉండకూడదన్న ఉద్దేశంతోనే అన్ని యుద్ధ నౌకల్ని సమర సన్నద్ధం చేస్తున్నామని బ్రిటన్ సైనిక వర్గాల్ని ఉటంకిస్తూ నివేదికలు వెలువడుతున్నాయి. ఈ కొత్త యుద్ధ నౌకను ఇతరత్రా పరీక్షించిన తర్వాత నౌకాదళానికి అప్పగిస్తారు. డెస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, కొత్త విమాన వాహక నౌక..ఇలా అన్నింటినీ సర్వసన్నద్ధంగా ఉంచింది. ఇంతకీ యుద్ధం వస్తుందో రాదో తేలకుండా..అలాంటి పరిస్థితి ఉంటుందో ఉండదో నిర్థారించుకోకుండా బ్రిటన్ ఇలా యుద్ధానికి సిద్ధం కావడానికి కారణం..ఇటు ట్రంప్‌గానీ అటు జోంగ్ గానీ వెనక్కి తగ్గక పోవడమే..అర్జెంటీనాలో తలెత్తిన ఫాక్‌లాండ్ సంక్షోభ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించామో అదే తరహాలో ఇప్పుడు ఉత్తర కొరియా విషయంలోనూ ముందుకెళ్లాలన్నది బ్రిటన్ యోచన..అప్పట్లో కూడా ముందుగానే పరిస్థితిని ఊహించి హెచ్‌ఎమ్‌ఎస్‌ను పంపింది. అదే తీరులో ఉత్తర కొరియా- అమెరికా వివాదం ఇప్పట్లో సమసే అవకాశం కనిపించడం లేదు. అమెరికా దూకుడుకు కళ్లెం వేసే విధంగా ఇటు రష్యా అటు చైనాలూ పావులు కదుపుతున్నాయి. దౌత్యపరమైన ప్రయత్నాలన్నీ సమసిపోయాయంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన నేపథ్యంలో పరిస్థితి మరింత విషమించేందుకే అవకాశం కనిపిస్తోంది. జోంగ్ దూకుడు తగ్గిస్తారా లేక ట్రంప్ మరింతగా రెచ్చిపోతారా అన్నదే తాజా సంక్షోభాన్ని ఎలాంటి మలుపైనా తిప్పే అంశం.