స్పాట్ లైట్

మళ్లీ ‘అణు’ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల క్రితం ఇరాన్‌తో కుదుర్చుకున్న పౌర అణు ఇంధన ఒప్పందానికి అమెరికా ఎసరు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా ఇరాన్ అణు ఒప్పందంపై కారులు మిరియాలు నూరుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆ ఒప్పందానే్న ధ్రువీకరించడానికి నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య కథ మొదటికి వచ్చింది. అణు ఒప్పందానికి ముందువరకు కూడా ఇరాన్ ప్రపంచ దేశాల నుంచి తీవ్రస్థాయిలోనే ఆంక్షలను ఎదుర్కొంటూ వచ్చింది.
అనేక దేశాల కలయికగా బరాక్ ఒబామా హయాంలో ఎట్టకేలకు ఈ ఒప్పందం కుదిరింది. దాని పర్యవసానంగా అనేక రకాలుగా ఇరాన్ కూడా తన అణు కార్యక్రమాన్ని కుదించుకోవడమూ జరిగింది. రెండేళ్ల క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించడానికి ట్రంప్ నిరాకరించిన నేపథ్యంలో మళ్లీ రెండు దేశాల మధ్య అంతకు ముందెన్నడూ లేని రీతిలో సంఘర్షణ తలెత్తే పరిస్థితి ఏర్పడింది. కేవలం అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన అది అమలులోకి వచ్చేసినట్లు కాదు. అది ఏ మరకు అమలు అవుతోందన్నది అగ్రరాజ్య నిపుణుల కమిటీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయితే ఆ ఒప్పందం త్రికరణ శుద్ధిగా అమలు కావడం లేదన్న కథనాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కీలక ఒప్పందంలో అమెరికాతోపాటు మరో ఆరు దేశాలు కూడా సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి కూడా దీని అమల్లో కీలక భాగస్వామ్యానే్న వహించింది.
ఒప్పందంలో భాగంగా ప్రతి తొంభై రోజులకు ఒకసారి దాని అమలును పర్యవేక్షించాలన్న నిబంధనను కూడా అందులో చేర్చారు. అన్ని దేశాలు కూడా పౌర అణు ఒప్పందం నియమ నిబంధనలను ఇరాన్ పూర్తిగా అమలు చేస్తోందని, వాటికి అనుగుణంగానే వ్యవహరిస్తోందని చెప్పినప్పటికీ ట్రంప్ మాత్రం తన దారే వేరన్నట్లుగా ఇరాన్‌తో తగాదాకే తెగించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇరాన్ ఒప్పందం అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్ దాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, అమెరికా దౌత్య చరిత్రలోనే అంత ఘోరమైన ఒప్పందం లేదని కూడా వ్యాఖ్యానించారు. వాటన్నింటి పర్యవసానంగానే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఇరాన్ పట్ల ట్రంప్ వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఒప్పందానే్న ధ్రువీకరించడానికి నిరాకరించడం ద్వారా మరింతగా సమస్యను రగిలించే ప్రయత్నం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఇరాన్‌పై ఆంక్షల కత్తి వేలాడే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే దీని విపరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది ఊహించడమే కష్టం. ఒప్పంద నియమ నిబంధనలను త్రికరణశుద్ధిగా పాటిస్తున్నప్పటికీ కేవలం కుంటి సాకులతో దాన్ని రద్దు చేసుకోవడం అన్నది అమెరికా తన ప్రతిష్ఠను తానే దెబ్బతీసుకున్నట్లు అవుతుందని తప్ప మరేమీ కాదు.