స్పాట్ లైట్

జీ.. హుజూర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసమ్మతి స్వరాలుంటేనే ఎక్కడైనా సమస్య. అలాగే వ్యతిరేకులను పోగుచేసే వ్యూహాత్మక ప్రత్యర్థులుంటేనే ఇబ్బందులు మొదలవుతాయి. ఈ రెండూ లేకుండా జిన్‌పింగ్ వ్యూహాత్మక రీతిలోనే అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ పావులు కదిపారు. అలాగే ఇటు మావో, అటు డెంగ్‌లతో సరిసమానంగా హోదాను సంతరించుకుంటూ సరికొత్త సామ్యవాద సిద్ధాంతాలతో తన పేరును పార్టీ నియమావళిలో నిక్షిప్తం చేసుకోగలిగారు.

!ఆధునిక చైనా చరిత్రలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అరుదైన ఘనతను సాధించారు. ఇటు పార్టీపైనా, అటు ప్రభుత్వంపైనా తిరుగులేని పట్టును సంతరించుకోవడంతోపాటు తనకు సమీప భవిష్యత్తులో బలమైన ప్రత్యర్థి అంటూ ఎవరూ లేకుండా తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారని చెప్పడానికి చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ 19వ జాతీయ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. ఇటు పార్టీపైనా, అటు ప్రభుత్వంపైన జిన్‌పింగ్ అంత బలంగా పట్టును, అధికారాన్ని సంపాదించిన నేత ఇటీవలి కాలంలో ఎవరూ లేరన్నది కూడా ఎంతైనా వాస్తవం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరో ఐదేళ్లపాటు ఆయన ఎన్నిక కావడం అన్నది లాంఛనమే అయినప్పటికీ చైనాలో జిన్‌పింగ్ అధికారానికి ఇప్పట్లో తిరుగేలేదని చెప్పే బలమైన సంకేతాలకు ప్రస్తుత పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏ నాయకుడైనా తనకు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టుకున్నప్పుడే అలాగే తన మాటను ధిక్కరించే బలమైన ప్రత్యర్థులెవరూ లేకుండా చేసుకోగలిగినప్పుడే అనుకున్న రీతిలో అధికారాన్ని చెలాయించగలుగుతాడు. ఇప్పుడు చైనా అధినేతగా, అధికార పార్టీ అధిపతిగా జిన్‌పింగ్ చేస్తున్నదీ ఇదే. తన అధికారాన్ని సవాలు చేసే స్థాయి ఎవరికీ లేకుండా ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ ఆయన చేసుకోగలుగుతున్నారు. ఇందుకు లేశ మాత్రంగా అవకాశం ఉన్నా దాన్నీ తుంచేస్తున్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మక రీతిలోనే గత కొన్ని నెలలుగా జిన్‌పింగ్ పావులు కదుపుతూ వచ్చారు. బీజింగ్ ప్లీనరీకి ముందే దేశంలో అవినీతిని ప్రక్షాళన చేసే బృహత్తర కార్యక్రమానికి జిన్‌పింగ్ శ్రీకారం చుట్టడం అన్నది తన సచ్చీలతను, నిజాయితీని, అదే విధంగా అధికార బలాన్ని నిరూపించుకునే ప్రయత్నమే. సహజంగానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాదేశిక నేతలందరినీ ఆయన నిర్దాక్షిణ్యంగా సాగనంపారు. ఈ విషయంలో ఎవరిపట్లా ఎలాంటి వివక్షా లేదని చెబుతూనే అన్ని విధాలుగా ప్రక్షాళన కార్యక్రమాన్ని తనకు అనువుగా మార్చుకున్నారు. అత్యంత శక్తివంతమైన చైనా కమ్యూనిస్టు పార్టీలో తన నిర్ణయాలను ఎదిరించే వారవెవరూ లేకుండా చేసుకోవడం కూడా జిన్‌పింగ్ అధికారం సుస్థిరం కావడానికి బలమైన కారణంగా చెప్పవచ్చు. తాజాగా పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన ఐదుగురూ కూడా జిన్‌పింగ్ నాయకత్వానికి ఏ విధంగానూ సవాలు విసిరే అవకాశం లేదు. అంతా ‘తానా అంటే తందానా’ అనే రీతిలో ఈ శక్తివంతమైన కమిటీని ఏర్పాటు చేయడం అన్నది జిన్‌పింగ్ అధికార వ్యూహానికి, దాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలకు అద్దంపట్టేదే. పార్టీమీద పూర్తిగా నియంత్రణను అధికారాన్ని సంతరించుకోగలిగితే వరుసగా మూడోసారి కూడా మరో ఐదేళ్ల పదవీ కాలాన్ని చేపట్టే విధంగా అధికార పార్టీ నియమావళిని తదనుగుణంగా సవరించేందుకు వీలుంటుంది.
అసమ్మతి స్వరాలుంటేనే ఎక్కడైనా సమస్య. అలాగే వ్యతిరేకులను పోగుచేసే వ్యూహాత్మక ప్రత్యర్థులుంటేనే ఇబ్బందులు మొదలవుతాయి. ఈ రెండూ లేకుండా జిన్‌పింగ్ వ్యూహాత్మక రీతిలోనే అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ పావులు కదిపారు. అలాగే ఇటు మావో, అటు డెంగ్‌లతో సరిసమానంగా హోదాను సంతరించుకుంటూ సరికొత్త సామ్యవాద సిద్ధాంతాలతో తన పేరును, పార్టీ నియమావళిలో నిక్షిప్తం చేసుకోగలిగారు. ఇవన్నీ కూడా ఆధునిక చైనాను తనదైన రీతిలో శైలిలో జిన్‌పింగ్ ముందుకు తీసుకెళుతున్నారని చెప్పడానికి సంకేతంగా నిలిచేదే కాకుండా ఆయన అధికారం కూడా అదే స్థాయిలో సుస్థిరమవుతోందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచేవే. ఆర్థిక ప్రణాళిక, ఆధునిక చైనాను తిరుగులేని రీతిలో అంతర్జాతీయ శక్తిగా మార్చడం, సార్వభౌమత్వ పరిరక్షణ, ప్రాదేశిక సమగ్రతను సుస్థిరం చేసుకోవడం - ఇవన్నీ కూడా జిన్‌పింగ్ ఆశయాలు, ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాకు జిన్‌పింగ్ సారథ్యం, ఆయన అనుసరిస్తున్న ఏకోన్ముక విధానాలు మరింత బలాన్ని ఇచ్చేవే అవుతాయి. జింగ్ సారథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైన రీతిలో పుంజుకుందని చెప్పడానికి ఏ విధంగానూ సందేహించాల్సిన అవసరం లేదు. ఇటు ప్రజలకు దూరం కాకుండా ఉండడానికి, అటు పార్టీ బలానికి మరింతగా దోహదం చేసే రీతిలోనే జిన్‌పింగ్ తనదైన శైలిలోనే చర్యలు తీసుకున్నారు. ఆదాయ వ్యత్యాసాలను తొలగించడంతోపాటు దేశీయ వినియోగ స్థాయిని కూడా పెంచేందుకు ఆయన ఆలోచనాత్మక రీతిలోనే వ్యవహరించారు. అగ్రదైశమైన అమెరికా అన్ని విధాలుగా తన ప్రయోజనాలను పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు కారణం తాజా అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్న బలమైన నినాదంతో ముందుకు రావడమే. ఈ నేపథ్యంలో చైనా కూడా తన ఆర్థిక వృద్ధిని పెంచుకోవడంతోపాటు అంతర్జాతీయంగా బలమైన శక్తిగా ఎదగాలంటే అందుకు తగ్గట్టుగా వేగాన్ని పెంచుకోవాల్సిన అవసరం జిన్‌పింగ్‌కు ఎంతైనా ఉంది. ఇందుకోసం సుదీర్ఘ లక్ష్యాలనే జిన్‌పింగ్ నిర్దేశించుకున్నారు. అదే విధంగా దక్షిణ చైనా మహాసముద్రంపై తన పట్టును సడలించకుండానే భారత్ వంటి ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తాజాగా తిరుగులేని అధికారాన్ని సంతరించుకున్న జిన్‌పింగ్ రానున్న కాలంలో చైనాను ఏ విధంగా ముందుకు తీసుకెళతారు? సంపన్న దేశాలతో పోటీగా దేశ ఆర్థిక వ్యవస్థను, అదే విధంగా సైనిక సత్తాను ఎలా ఇనుమడింపచేస్తారు అన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. అధికార కమ్యూనిస్టు పార్టీలో అత్యంత బలంగా ఉన్న నేతలు సైతం తన మాట జవదాటే పరిస్థితి లేనప్పుడు ఈ తిరుగులేని అధికారంతో జిన్‌పింగ్ మరింతగా చైనాను అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా మార్చేందుకు క్రియాశీలక వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట గెలిచినప్పుడే రచ్చ గెలిచే అవకాశం ఉంటుంది. దీన్ని పూర్తిగా ఒంటబట్టించుకున్న జిన్‌పింగ్ ఆశాశమే హద్దుగా చైనాను ఆర్థికంగా, రాజకీయంగా, అన్నింటికీ మించి తాను అనుకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పరుగులు పెట్టిస్తున్నారు. రెండోసారి ఐదేళ్ల కాలవ్యవధి కోసం ఆయన ఎన్నికైనప్పటికీ ముచ్చటగా మూడోసారి చైనా సారథ్యం తన చేయి జారకుండా చాలా ముందుగానే బలమైన పాచికలే జిన్‌పింగ్ విసిసారు. ఈ తిరుగులేని శక్తి, యుక్తి ఎంతమేరకు చైనాకు అంతర్గత ధీమాను అందిస్తుంది? రానున్న కొనే్నళ్ల కాలంలో ప్రపంచ శక్తిగా రాణించడానికి ఏ మేరకు దోహదం చేస్తుందన్నది కూడా సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిసోంది. మొత్తం మీద ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని ‘జీ హుహూర్...’ అనిపించుకున్న జిన్‌పింగ్ వేసే ప్రతి అడుగూ కీలకమే అవుతోంది. వర్తమాన చైనా భవిష్యత్ పథానికి సంకేతంగా నిలుస్తుంది.

బి.రాజేశ్వర ప్రసాద్